మహిళలను మసీదుల్లోకి అనుమతించాలని తెలంగాణ హైకోర్టు తాజాగా పేర్కొంది. మసీదు. జాషన్స్, ఇతర ప్రార్థనా మందిరాల్లోకి షియా తెగకు చెందిన మహిళలను అనుమతించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. షియా ముస్లిం మహిళలను మసీదు, ఇతర పవిత్ర ప్రాంతాల్లో ప్రార్థనలకు అనుమతించట్లేదంటూ ‘అంజుమన్ ఎ అలవి షియా ఇమామియా ఇత్నా అశరి (అక్బరీ) సొసైటీ’ కార్యదర్శి ఆస్మా ఫాతిమా హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషన్‌పై హైకోర్టు జడ్జి జస్టిస్ నగేశ్ భీమపాక సోమవారం విచారణ చేపట్టారు. ఇబ్దత్‌కానాకు చెందిన ముత్తవల్లీల కమిటీ కేవలం షియా తెగకు చెందిన మహిళలకు ప్రార్థనా మందిరాలకు అనుమతించడంలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో వక్ఫ్ బోర్డుకు వినతి పత్రాలు అందించిన ఉపయోగం లేకపోయిందని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు
ప్రార్థనా స్థలాల్లో లింగ వివక్ష ఉండరాదని, దేవుడి ముందు స్త్రీ, పురుషులందరూ సమానమేనని రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. శని సింగనాపూర్, హాజీ అలీ దర్గా, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ కోర్టులు ఇచ్చిన వరుస తీర్పుల్లో ముస్లిం మహిళలకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.
స్త్రీలు పురుషుల కంటే తక్కువ కాదని నమ్ముతారు. పురుషుడి కంటే స్త్రీ ఎలా తక్కువ అవుతుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. దేవుడి ముందు స్త్రీ, పురుషులందరూ సమానమేనని, దేవుడికి లింగ వివక్ష లేదని స్పష్టమైంది. పురుషుడి కంటే స్త్రీని తక్కువ అని భావిస్తే, జన్మనిచ్చిన తల్లి కూడా స్త్రీయేనని, ఆ తల్లి మనకంటే ఎలా తక్కువ అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. నిర్ణీత రోజుల్లో తప్ప మహిళలు స్వేచ్ఛగా ప్రార్థనా స్థలాలకు వెళ్లి ప్రార్థనలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
మరోవైపు, ఖురాన్ ప్రకారమే ప్రార్థనా మందిరాల్లోకి అనుమతి ఉంటుందని వక్ఫ్ బోర్డు తరపు న్యాయవాది పేర్కొన్నారు. అయితే, మహిళలపై వివక్ష ప్రదర్శించడం తగదని, రాజ్యాంగం వారికి సమానత్వ హక్కులు కల్పించిందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటు స్వామి వివేకానంద ఖురాన్, బైబిల్, తోరా, భగవద్గీత, యోగి ఆత్మకథ తదితర అంశాల్లో మహిళలకు సంబంధించిన పలు అంశాలను చదివి వినిపించారు. ఈ క్రమంలో షియా మహిళలను ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించాలంటూ ముత్తవల్లీ కమిటీని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
More Stories
రుణమాఫీపై బహిరంగ చర్చకు రేవంత్ కు ఏలేటి సవాల్!
ముందు చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించండి రేవంత్
బంజారా మ్యూజియం ప్రారంభించిన ప్రధానికి కృతజ్ఞతలు