పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పటికీ మనదే..ఎవరూ లాక్కోలేరు

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌దేనని, దీన్ని ఎవరూ తమ నుంచి లాక్కోలేరని  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.  జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం తన తుది తీర్పును వెల్లడించింది. 

కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది.  జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం తన తుది తీర్పును వెల్లడిస్తూ కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది.

దీనిపై అమిత్ షా రాజ్యసభలో ప్రసంగిస్తూ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తోన్నట్లు చెప్పారు. ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక ప్రొవిజన్ అని సుప్రీంకోర్టు విశ్వసించిందని చెబుతూ ఇది శాశ్వతమని నమ్మినవారు రాజ్యాంగాన్ని, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీని అవమానించినట్టేనని విమర్శించారు. 
 
గవర్నర్/రాష్ట్రపతి పాలనలో తీసుకున్న నిర్ణయాలను గానీ, చేసిన ప్రకటనలను గానీ సవాల్ చేసే హక్కు కూడా ఎవరికీ లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని అమిత్ షా గుర్తు చేశారు. ఆర్టికల్ 370ని ఎప్పుడైనా తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉందని, ఈ మేరకు ఆర్టికల్ 373లో దీనికి సంబంధించిన క్లాజ్‌ను పొందుపరిచినట్లు పేర్కొన్నారు.
 
ఇప్పటికీ కాంగ్రెస్ తమ పాత నిర్ణయానికే కట్టుబడి ఉంటే మరోసారి ఆ పార్టీకి ఘోర పరాజయం తప్పదని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమ గెలుపును ఎవరూ ఆపలేరని హెచ్చరించారు. మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అధికారాన్ని అప్పగించి తీరుతారని తేల్చి చెప్పారు.  ఇదివరకు జమ్మూలో 37, కాశ్మీర్‌లో 46 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవని, పునర్విభజన తరువాత వాటి సంఖ్య 43, 47కు పెరిగాయని అమిత్ షా గుర్తు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలను రిజర్వ్‌లో ఉంచామని, అవి ఎప్పటికీ తమవేనని అమిత్ షా స్పష్టం చేశారు.