
ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడు నడయాడిన నేల అయోధ్య. త్రేతాయుగం కాలానికి చెందిన ఈ నగరంలో రామ మందిరం పునః నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోట్లాది మంది హిందువుల కల సాకారం కాబోతున్నది. విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలకు అయోధ్య రామయ్య ఆలయం ముస్తాబవుతున్నది.
జనవరి 22న శ్రీరామ జన్మభూమి దేవాలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగనున్నది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. 130 దేశాల ప్రతినిధులు హాజరవనున్నారు. ఆలయ పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సర్వాంగ సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నది.
శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని కలిపే ప్రధాన మార్గములన్నిటిలో రామాయణ కాలం నాటి కీలకమైన ఘట్టాలను అందంగా చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదేశాల మేరకు అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ రామజన్మభూమి ఆలయానికి వెళ్లే అన్ని ప్రధాన రహదారుల గోడలపై కళాఖండాలను అలంకరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
రామాయణ ఇతిహాసాలకు సంబంధించిన చిత్రాలతో అయోధ్య నగరాన్ని సుందరీకరించనున్నారు. టెర్రకోట కళాఖండాలు తొమ్మిది అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో ఉండనున్నాయి. టెర్రకోట మ్యూరల్ ఇనిషియేటివ్ అయోధ్య డెవలప్‌మెంట్ హిస్టారిక్ సిటీ సర్క్యూట్స్, హెరిటేజ్ యొక్క వ్యూహానికి అనుగుణంగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.
టెర్రకోట కళాఖండాలు తొమ్మిది అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో 50కి పైగా కుడ్య శిల్పాలు, మ్యూరల్ పెయింటింగ్స్ ఉండనున్నాయి. వీటిని రామాయణ ఘట్టాల ఆధారంగా తీర్చిదిద్దనున్నారు. నదీ గర్భంలో నుంచి సేకరించిన నాణ్యమైన బంకమట్టిన మాత్రమే ఇందుకు వినియోగించనున్నారు.
ఇదిలా ఉండగా, జనవరి 22 మధ్యాహ్నం 12.20 గంటలకు మృగశిర నక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో అయోధ్య రామయ్య విగ్రహానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట జరుగనున్నది. నాలుగు దశల్లో వేడుకలను నిర్వహించనున్నారు. తొలిదశలో కార్యాచరణ సిద్ధం చేస్తారు. రెండో దశలో 10 కోట్ల కుటుంబాలకు రామయ్య అక్షింతలు, రాంలాల చిత్రం, కరపత్రం అందజేస్తారు. మూడో దశలో జనవరి 22న దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించనున్నారు. నాలుగో దశలో జనవరి 26 నుంచి భక్తులకు అయోధ్య రామయ్య దర్శనం కల్పించనున్నారు.
శ్రీరామచంద్రమూర్తి ఆలయ మొదటి అంతస్తు పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయ గర్భగుడి సైతం దాదాపు సిద్ధమైందని. ఇటీవల లైటింగ్ పనులు సైతం పూర్తయినట్లు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ తెలిపారు. ఈ క్రమంలో ఆలయ గర్భగుడి ఫోటులతోపాటు రామ జన్మభూమి ఆలయం ఏ దశలో ఉందో తెలియజేసే మరికొన్ని ఫోటోలను ఆయన సోషల్ మీడియా సైట్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా విడుదల చేయగా వైరల్ అయ్యాయి.
బాల రాముడి విగ్రహ నిర్మాణం మూడు లొకేషన్లలో జరుగుతోందని, దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని రాయ్ వివరించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని గర్భగృహంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని, ఆలయ గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం కూడా దాదాపు పూర్తి కావచ్చినందున చెప్పారు.
More Stories
రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది
కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం!