 
                కొద్దీ నెలల్లో జరుగనున్న 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సామజిక సమీకరణాలను సమతుల్యం చేసేవిధంగా కసరత్తు చేస్తున్నారు.  పార్టీ నియమించిన కేంద్ర పరిశీలకులు మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా ఎవర్ని ఉంచాలనే అంశంపై చర్చిస్తారు. మరో రెండు రోజులలో వీరు ఆయా రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను ప్రకటించే అవకాశం ఉంది.
రాజస్థాన్ పరిశీలకులుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, వినోద్ తవాడే, సరోజ్ పాండేలను పార్టీ నియమించింది. మధ్యప్రదేశ్కు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కె లక్ష్మణ్, ఆశ లక్రాలను నియమించింది. ఛత్తీస్గఢ్లో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, సర్బానంద సోనోవాల్, దుష్యంత్ గౌతమ్లను పరిశీలకులుగా నియమించారు.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశాలను పర్యవేక్షించేందుకు పరిశీలకులు ఆయా రాష్ట్రాలకు వెళ్తారని, అక్కడ కాబోయే ముఖ్యమంత్రి పేరు వెల్లడించే అవకాశం ఉందని ఓ బీజేపీ నేత తెలిపారు. సీఎం ఎంపికపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ముఖ్యమంత్రులను ఎన్నుకోవడంలో సామాజిక, ప్రాంతీయ, పాలన, సంస్థాగత ప్రయోజనాలను దృష్టి ఉంచుకుంటారని తెలిపారు.





More Stories
బీహార్ ఎన్నికల ఎన్డీయే మేనిఫెస్టోలో కోటి ప్రభుత్వ ఉద్యోగాలు
సుప్రీంకోర్టు 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్
ముంబైలో పిల్లలను బందీలుగా తీసుకున్న ఆర్య కాల్చివేత