తెలంగాణాలో కొత్తగా ఎన్నికైన ఎమ్యెల్యేలు

తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ 64 సీట్లలో విజయం సాధించగా, బీఆర్ఎస్‌ 39 సీట్లకే పరిమితమైంది. బీజేపీ 8 సీట్లు గెలుచుకోగా, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానంలో విజయం సాధించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్ నేతల బృందం ఆదివారం రాత్రి రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు.
సోమవారం శాసనసభాపక్ష సమావేశం అనంతరం సీఎల్పీ నేత పేరును నివేదిస్తామని నేతలు చెప్పినట్లు సమాచారం. గవర్నర్‌ను కలిసిన వారిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తోపాటు ఆ పార్టీ ముఖ్య నేతలు డీకే శివకుమార్, మాణిక్ రావ్ ఠాక్రే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థులు(64)
  • చెన్నూరు- గడ్డం వివేకానంద్
  • బెల్లంపల్లి-గడ్డం వినోద్
  • మంచిర్యాల-కొక్కిరాల ప్రేంసాగర్ రావు
  • ఖానాపూర్-వేదమ భోజ్జు
  • బోధన్-పి. సుదర్శన్ రెడ్డి
  • జుక్కల్-లక్ష్మీకాంతరావు తోట
  • ఎల్లారెడ్డి-మదన్ మోహన్ రావు. కె
  • నిజామాబాద్ (రూరల్)-భూపతి రెడ్డి రేకులపల్లి
  • ధర్మపురి-అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  • రామగుండం-మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్
  • మంథని-దుద్దిళ్ల శ్రీధర్ బాబు
  • పెద్దపల్లె-చింతకుంట విజయ రమణారావు
  • చొప్పదండి-మేడిపల్లి సత్యం
  • వేములవాడ-ఆది శ్రీనివాస్
  • మానకొండూర్-డిఆర్. కవ్వంపల్లి సత్యనారాయణ
  • హుస్నాబాద్-పొన్నం ప్రభాకర్
  • మెదక్ -మైనంపల్లి రోహిత్
  • నారాయణఖేడ్-పట్లోళ్ల సంజీవ రెడ్డి
  • ఆందోల్-సి. దామోదర్ రాజనర్సింహ
  • ఇబ్రహీంపట్నం-మల్రెడ్డి రంగారెడ్డి
  • పరిగి- తమ్మన్నగారి రామ్ మోహన్ రెడ్డి
  • వికారాబాద్-గడ్డం ప్రసాద్ కుమార్
  • తాండూరు-బి. మనోహర్ రెడ్డి
  • కొడంగల్-అనుముల రేవంత్ రెడ్డి
  • నారాయణపేట-చిట్టెం పర్ణికా రెడ్డి
  • మహబూబ్ నగర్-యెన్నం శ్రీనివాస్ రెడ్డి
  • జడ్చర్ల-అనిరుధ్ రెడ్డి జానంపల్లి
  • దేవరకద్ర-గావినోళ్ల మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్)
  • మక్తల్-వాకిటి శ్రీహరి
  • వనపర్తి-మేఘా రెడ్డి తుడి
  • నాగర్ కర్నూల్- డా. కుచుకుల రాజేష్ రెడ్డి
  • అచ్చంపేటృ-చిక్కుడు వంశీ కృష్ణ
  • కల్వకుర్తి-నారాయణరెడ్డి కసిరెడ్డి
  • షాద్‌నగర్-కె శంకరయ్య
  • కొల్లాపూర్-జూపల్లి కృష్ణరావు
  • దేవరకొండ-బాలు నాయక్ నేనావత్
  • నాగార్జున సాగర్-కుందూరు జయవీర్
  • మిర్యాలగూడ-బత్తుల లక్ష్మారెడ్డి
  • హుజూర్‌నగర్-ఉత్తమ్ కుమార్ రెడ్డి నలమాడ
  • కోదాడ-నలమడ పద్మావతి రెడ్డి
  • నల్గొండ-కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
  • మునుగోడు-కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
  • భువనగిరి-కుంభం అనిల్ కుమార్ రెడ్డి
  • నక్రేకల్-వేముల వీరేశం
  • తుంగతుర్తి-మందుల సామేలు
  • ఆలేరు-ఐలయ్య బీర్ల
  • పాలకుర్తి-యశస్విని మామిడాల
  • డోర్నకల్-జాటోత్ రామ్ చందర్ నాయక్
  • మహబూబాబాద్-డా. మురళీ నాయక్ భుక్యా
  • నర్సంపేట- దొంతి మాధవ రెడ్డి
  • పరకాల-రేవూరి ప్రకాష్ రెడ్డి
  • వరంగల్ వెస్ట్-నాయిని రాజేందర్ రెడ్డి
  • వరంగల్ తూర్పు-కొండా సురేఖ
  • వారధనపేట-కె.ఆర్.నాగరాజ్.కె
  • భూపాలపల్లె-గండ్ర సత్యనారాయణరావు
  • ములుగు-దనసరి అనసూయ సీతక్క
  • పినపాక-పాయం వెంకటేశ్వర్లు
  • ఇల్లందు-కోరం కనకయ్య
  • ఖమ్మం-తుమ్మల నాగేశ్వరరావు
  • పాలేరు-పొంగులేటి శ్రీనివాస రెడ్డి
  • మధిర-భట్టి విక్రమార్క మల్లు
  • వైరా-రామదాస్ మలోత్
  • సత్తుపల్లె-మట్ట రాగమయి
  • అశ్వారావుపేట-ఆదినారాయణ
  • ఆసిఫాబాద్- కోవా లక్ష్మి
  బీఆర్ఎస్ అభ్యర్థులు (39)
  • బోథ్- అనిల్ జాదవ్
  • బాన్సువాడ-శ్రీనివాస్ రెడ్డి (పోచారం)
  • బాల్కొండ-ప్రశాంత్ రెడ్డి వేముల
  • కోరుట్ల-కల్వకుంట్ల సంజయ్
  • జగిత్యాల-డా. సంజయ్
  • కరీంనగర్ – గంగుల కమలాకర్
  • సిరిసిల్ల-కల్వకుంట్ల తారక రామరావు (K.T.R)
  • హుజూరాబాద్-కౌశిక్ రెడ్డి పాడి
  • సిద్దిపేట-తన్నీరు హరీష్ రావు
  • నర్సాపూర్-వాకిటి సునీత లక్ష్మారెడ్డి
  • జహీరాబాద్-కొనింటి మాణిక్ రావు
  • సంగారెడ్డి-చింతా ప్రభాకర్
  • పటాన్చెరు-గూడెం మహిపాల్ రెడ్డి
  • దుబ్బాక-కొత్త ప్రభాకర్ రెడ్డి
  • గజ్వేల్-కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
  • మేడ్చల్-చామకూర మల్లా రెడ్డి
  • మల్కాజిగిరి-మర్రి రాజశేఖర్ రెడ్డి
  • కుత్బుల్లాపూర్-కె.పి. వివేకానందుడు
  • కూకట్‌పల్లె-మాధవరం కృష్ణారావు
  • ఉప్పల్-బండారి లక్ష్మారెడ్డి
  • లాల్ బహదూర్ నగర్-దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
  • మహేశ్వరం-పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి
  • రాజేంద్రనగర్-టి. ప్రకాష్ గౌడ్
  • శేరిలింగంపల్లి-అరెకపూడి గాంధీ
  • చేవెళ్ల-కాలే యాదయ్య
  • ముషీరాబాద్-ముటా గోపాల్
  • అంబర్‌పేట్ -కాలేరు వెంకటేష్
  • ఖైరతాబాద్-దానం నాగేందర్
  • సనత్‌నగర్-తలసాని శ్రీనివాస్ యాదవ్
  • సికింద్రాబాద్- పద్మారావు.టి
  • సికింద్రాబాద్ కంటోన్మెంట్-లాస్య నందిత సయన్న
  • గద్వాల్-బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
  • అలంపూర్-విజయుడు
  • సూర్యాపేట-గుంటకండ్ల జగదీష్ రెడ్డి
  • జంగోన్-పల్లా రాజేశ్వర్ రెడ్డి
  • ఘన్‌పూర్ (స్టేషన్)-కడియం శ్రీహరి
  • భద్రాచలం – డా. తెల్లం వెంకటరావు

బీజేపీ అభ్యర్థులు (8)

  • సిర్పూర్ -డా.పాల్వాయి హరీష్ బాబు
  • ఆదిలాబాద్-పాయల్ శంకర్
  • నిర్మల్-అల్లేటి మహేశ్వర్ రెడ్డి
  • ముధోల్-రామ్ రావు పవార్
  • ఆర్మూర్-పైడి రాకేష్ రెడ్డి
  • కామారెడ్డి-కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
  • నిజామాబాద్ (అర్బన్)-ధనపాల్ సూర్యనారాయణ
  • గోషామహల్-టి. రాజా సింగ్

ఏఐఎంఐఎం అభ్యర్థులు (7)

  • మలక్‌పేట్ -అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా
  • నాంపల్లి- మహమ్మద్ మజీద్ హుస్సేన్
  • కార్వాన్ -కౌసర్ మొహియుద్దీన్
  • చార్మినార్-మీర్ జుల్ఫెకర్ అలీ
  • చాంద్రాయణగుట్ట -అక్బర్ ఉద్దీన్ ఒవైసీ
  • యాకుత్‌పురా -జాఫర్ హుస్సేన్
  • బహదూర్‌పురా -మొహమ్మద్ ముబీన్

సీపీఐ

  • కొత్తగూడెం-కూనంనేని సాంబశివరావు