కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ఎజెండా ఒక్కటే

కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల అజెండా ఒక్కటే అని చెబుతూ  ‘టీఆర్ఎస్, కాంగ్రెస్‌తో జతకట్టి ప్రజలను మోసం చేయాలని చూస్తుంది. అధికార పార్టీ కుటుంబ పాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటుంది. తెలంగాణ ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తూ, ముస్లింలతో జతకట్టి మోసం చేస్తుంది’ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు.
 
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వేముల‌వాడ‌ , కాగజ్ నగర్లో బీజేపీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ గత 60 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం పేరిట పార్టీలు మోసం చేశాయని నీళ్లు, నిధులు నియామకాలు నినాదంతో అధికారంలోకి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే బ్రస్టా చార్ పార్టీ అని మండిపడ్డారు.
 
ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని చెబుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లు తీసుకువచ్చి ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తోందని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తీసుకురావాలని.. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని ప్రకటించారు.
 
ఉత్తరప్రదేశ్‌లో ఆరు సంవత్సరాల క్రితం రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అయితే ఆ తర్వాత యూపీలో డబల్ ఇంజన్ సర్కార్‌తో ముందుకు వెళ్తున్నాం అని తెలిపారు. యుపిలో లక్షల మంది నిరోద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని చెబుతూ డబల్ ఇంజన్ సర్కార్ అంటే డబల్ స్పీడ్‌తో వెళ్లే ప్రభుత్వo. ప్రధానమంత్రి మోదీ నేతృతంలో దేశంలో అందరూ తలెత్తుకునేలా చేసాడని భరోసా ఇచ్చారు. 
 
నయా భారత్ నరేంద్ర మోదీ నాయకత్వంలో ముందుకెళ్తున్నామని చెప్పారు. భారతదేశంలో అన్ని రంగాల్లో శరవేగంగా ముందుకెళ్తున్నామని పేర్కొంటూ అది నరేంద్ర మోదీతోనే సాధ్యం అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు చేసింది ఏమీ లేదని, బీజేపీ రైతుల కోసం సామాన్యుల కోసం ఏర్పాటు చేసిన పార్ తెలిపారు. మోదీ 10 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారని.. 6 లక్షలు ఇచ్చారని.. మిగతావి పూర్తి చేస్తారని చెప్పుకొచ్చారు.
 
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారి ప్రజలను మోసం చేసిందంటూ  గత పదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంద‌ని ఆదిత్యనాథ్ ఆరోపించారు. వేములవాడ వికాసం కోసం గెలిపించాల‌ని, ఈసారి వికాస్ రావుకు అవకాశం ఇవ్వాల‌ని ఓట‌ర్లు కోరారు.  తెలంగాణాలో బీఎస్పీ అభ్యర్థులు పోటీచేయడాన్ని ప్రస్తావిస్తూ సొంత రాష్ట్రం అయిన యూపీలోనే బీఎస్పీకి కేవలం ఒక సీటు మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు. 
 
మోదీ నేతృత్వంలో నడుస్తున్న భారత ప్రభుత్వంపై ఏ దేశం కూడా కన్నెత్తి చూడలేదని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలో ఉంది కాబట్టే రామ మందిరం నిర్మాణం జరుగుతుందని చెబుతూ  అయోధ్య రామ మందిరం ప్రారంభానికి అందరూ రావాలని ఆదిత్య నాథ్ వేములవాడ ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే జనవరిలో అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభిస్తున్నామని వెల్ల‌డించారు.