
హమాస్ ఉగ్రవాదులతో ఎట్టకేలకు నాలుగు రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయిల్ అంగీకరించింది. అదేసమయంలో అక్టోబర్ 7వ తేదీన తమ చెరలోకి తీసుకున్న50 మంది బందీలను బందీలను కాల్పుల విరమణ నేపథ్యంలో విడిచిపెట్టేందుకు హమాస్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రధాని బెంజిమన్ నెతన్యూ నేతృత్వంలోని క్యాబినెట్ దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నది.
ఒప్పందం ప్రకారం కనీసం 50 మంది ఇజ్రాయిలీ, విదేశీ బందీలను రిలీజ్ చేయనున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. ఒకవేళ అదనంగా 10 మందిని విడుదల చేస్తే, అప్పుడు కాల్పుల విరమణను మరో రోజుప పొడుగించనున్నట్లు ఇజ్రాయిల్ చెప్పింది. ఇజ్రాయిల్ ఇచ్చిన ఆఫర్‌ను హమాస్ స్వాగతించింది. దీని వల్ల ఇజ్రాయిల్ జైళ్లలో ఉన్న సుమారు 150 మంది పాలస్తీనియన్లను కూడా విడిచిపెడుతారని భావిస్తున్నట్లు హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది.
హమాస్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం మొదలై ఏడు వారాలు దాటింది. ఆ యుద్ధం వల్ల స్థానిక జనం తీవ్ర నిస్తేజంలో ఉన్నారు. అయితే కాల్పుల విమరణ సమయంలో స్థానిక ప్రజలు కొంత సేద తీరే అవకాశాలు ఉన్నాయి. గ్రౌండ్ ఆపరేషన్‌తో పాటు వైమానిక దళ దాడులను కూడా కాల్పుల విరమణ సమయంలో నిలిపివేయనున్నారు. ముఖ్యంగా బందీలుగా ఉన్న మహిళలు, పిల్లలను విడుదల చేసేందుకు హమాస్ సిద్ధమని తెలుస్తున్నది.
ఈ సందర్భంగా ‘మేము సంధిపై ఒప్పందానికి చేసుకునే ఆలోచనలో ఉన్నాము’ అని ఇస్మాయిల్ తన పోస్టులో పేర్కొన్నారు. ఖతార్ మధ్యవర్తిత్వంలో ఇరుదేశాల మధ్య సంధికి చర్చలు జరుగుతున్నాయి. ఆదివారం ఖతార్ ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ తాత్కాలిక కాల్పుల విరమణ దిశగా చర్చలు జరిగాయని ప్రకటించారు.
అయితే, కాల్పుల విరమణకు ప్రతిఫలంగా కొంతమంది బంధీలను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ అది ఆచరణాత్మక సమస్యలపై ఆధారపడి ఉందని ఆయన తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సహితం వీరిద్దరి మధ్య ఒప్పందం దాదాపు జరుగబోతున్నట్లు సోమవారం ప్రకటించారు. అయితే ఈ ఒప్పందంలో ఐదురోజుల సంధి ఉంటుందని, కాల్పుల విరమణ, దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక కార్యకలాపాలు పరిమితం చేసేందుకు ఈ సంధిలో ప్రధాన అంశాలుగా ఉండనున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కాగా, అక్టోబర్ 7వ తేదీన హమాస్ గ్రూప్ దాడి చేసి దాదాపు 240 మంది ఇజ్రాయిలీలను బంధీల్ని చేసింది. ఈ బంధీలను విడుదల చేయడానికే ఒప్పందం కుదుర్చుకోవడానికే కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల దాదాపు 13 వేల మందికిపైగా మృతి చెందారని గాజాలోని హమాస్ ప్రభుత్వం వెల్లడించింది.
More Stories
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు