ఇప్పటికే దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కత్తి దాడి జరగ్గా, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కూడా దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఈరోజు గురువారం ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు.
చివరి సభ అయిన నర్సాపూర్‌లో ప్రసంగించే సమయంలో ప్రజల్లో ఉన్న ఓ వ్యక్తి అనుమాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. పోలీసులు ఆ యువకున్ని వెంటనే అదుపులోకి తీసుకుని పరిశీలించగా అతని దగ్గర రెండు బుల్లెట్లు దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. కాగా.. ఆ యువకుడిని అస్లాంగా గుర్తించారు పోలీసులు.
అస్లాం సంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. 2017లో డిగ్రీ మా నేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఓ యూట్యూబ్ చాన ల్ ఐడికార్డుతో ప్రెస్ గ్యాలరీలోకి ప్రవేశించినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు అస్లాం. అయితే కేవలం బుల్లెట్లు మాత్రం దొరికాయని తుపాకీ లేదని గుర్తించారు. అయితే బుల్లెట్లను అస్లాం ఎందుకు తీసుకువచ్చాడని ప్రశ్నార్థకంగా మారింది.
More Stories
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు
జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం?
క్షమాపణలు చెప్పిన వేణు స్వామి