
తెలంగాణలో ఎన్నికల వేళ ఆదాయపన్ను అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువులు, సంబంధికుల ఇళ్లపై ఆదాయపన్ను అధికారుల దాడులు నిర్వహించారు. హైదరాబాద్ సిటీలో మొత్తం పలు చోట్ల ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.
పది బృందాలుగా విడిపోయిన ఐటి అధికారులు ఆర్‌సిపురంలోని నాగులపల్లి, అమీన్‌పూర్‌లోని పటేల్‌గూడ, గచ్చిబౌలిలోని మైహోమ్ బూజాలో సోదాలు చేస్తున్నారు. గచ్చిబౌలిలోని మై హోం బూజాలో ఉంటున్న ప్రదీప్ అనే వ్యక్తి నివాసంలో ఆదాయపన్ను అధికారులు సోదాలు చేపట్టారు. ప్రదీప్ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి దగ్గరి బంధువు, ఆయన నివాసంతో పాటు ఇతర బంధువుల నివాసాల్లోనూ ఐటి అధికారులు సోదాలు చేపట్టారు.
దానితో పాటు ప్రముఖ ఫార్మా కంపెనీలో తనిఖీలు నిర్వహించారు. ఫార్మా కంపెనీ సిఇఒ, డైరెక్టర్ల ఇంటితో పాటు సిబ్బంది ఇళ్లల్లో సోదాలు చేశారు. సంస్థకు సంబంధించి ఆదాయ పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు సమాచారం.
నగరంలో 15 వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టగా, ఓ ఫార్మా కంపెనీ చైర్మన్, డైరెక్టర్ ఇళ్లతో పాటు సిబ్బంది ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు తని ఖీలు చేపట్టారు. సుమారుగా 10 ఐటి అధికారుల బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. పన్ను ఎగవేత ఫిర్యాదులపై వచ్చిన ఆర్థిక లావాదేవీల రికార్డులను ఐటి అధికారులు తనిఖీ చేశారు.
ఆర్‌సీపురంలోని నాగులపల్లి, అమీన్ పూర్ లోని పటేల్‌గూడ, గచ్చిబౌలిలో సోదాలు జరిగాయి. గచ్చిబౌలి ప్రాంతంలోని మై హోమ్ భూజా, అపార్ట్మెంట్లలోని ఫార్మా కంపెనీలకు చెందిన కొందరు ఉన్నతాధికారుల ఫ్లాట్లలో ఐటి అధికారుల సోదాలు నిర్వహించారు. ఇటీవల కాంగ్రెస్ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, జానారెడ్డి, పారిజాత నరసింహారెడ్డి, కెఎల్‌ఆర్ నివాసాలపై దాడులు జరిగిన విషయం విదితమే.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి