ఆర్ఎస్ఎస్ శతజయంతిలో సామజిక అంశాలపై దృష్టి

 రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రారంభించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా శతజయంతి సంవత్సరంలో  సామాజిక సామరస్యం, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, గో సేవ, కుటుంబ ప్రబోధన్ వంటి సామజిక అంశాలను సమాజం ముందుంచే కృషి చేస్తున్నట్లు సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే తెలిపారు.
 
గుజరాత్ లోని భోజ్ లో మూడు రోజులపాటు జరిగిన అఖిల భారతీయ కార్యకారమండలి సమావేశాల ముగింపు సందర్భంగా సమావేశాల వివరాలను మీడియాకు వివరిస్తూ మొదట, ఈ అంశాలను తమ స్వంత జీవితంలో, అదేవిధంగా సంఘ్ శాఖలలో స్వయంసేవకులు ఆచరించే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. 
 
సామాజిక సామరస్యంతో సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి, పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, నీటిని సంరక్షించడం వంటి అంశాల్లో కుటుంబ విద్య ద్వారా సాంస్కృతిక విలువలను రాబోయే తరానికి అందించాలని నిర్ణయించినల్టు ఆయన చెప్పారు.
 
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్రాంత్ లో సంఘ్ కార్యకర్తలు 14,000 కిలోమీటర్లు ప్రయాణించి 15 లక్షల చెట్లను నాటారని, కర్ణాటకలో సీడ్ బాల్ పద్ధతిలో కోటి మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించారని ఆయన తెలిపారు. దేశంలోని పౌరులందరి జీవనశైలి స్వదేశీయంగా ఉండాలని, పౌర కర్తవ్యాన్ని పాటిస్తూ తమ జీవితాల్లో క్రమశిక్షణ తీసుకురావాలని హోసబలే స్పష్టం చేశారు.
 
స్వయంసేవక్ లకు సంఘ్ నిర్వహించే శిక్షా వర్గ్ లలో పాఠ్యాంశాలలో కొన్ని మార్పులు తీసుకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.  ఇందులో యువకులు, పెద్దలు సహా ప్రతి వయస్సు వారికి పాఠ్యాంశాలు భిన్నంగా ఉంటాయని చెప్పారు. శిక్షా వర్గ్ సమయంలో సామాజిక జీవితంలోని వివిధ రంగాలలో ప్రత్యక్షంగా దోహదపడేలా మేధో, శారీరక మాత్రమే  కాకుండా, ఆచరణాత్మక శిక్షణ ఇవ్వబడుతుందని ఆయన వివరించారు.
 
సంఘ్‌లో రెండు రకాల పనులు ఉన్నాయని చెబుతూ ఒకటి శాఖాధారితం కాగా, మరొకటి సమాజంలో వ్యక్తిత్వాన్ని నిర్మించే పని అని చెబుతూ  సంఘ్ గత 98 సంవత్సరాలుగా ఎంతో పట్టుదలతో ఇటువంటి కృషి నిర్వహిస్తోందని హోసబలే తెలిపారు. సంఘ్ దృక్పథం ఒక వైపు సమాజానికి సేవ చేయడం కాగా, మరోవైపు, స్వయంసేవక్ వ్యక్తిత్వ నిర్మాణం అని ఆయన చెప్పారు. 
 
ఇటువంటి కృషి ద్వారా దేశం కోసం నిలబడే వ్యక్తిని ప్రతి కాలనీ, ప్రాంతంలో సృష్టించబడరని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజువారీ,  వారపు శాఖల సంఖ్య 95528 కాగా, శతాబ్ది సంవత్సరం నాటికి దేశంలోని 59060 మండలాలకు సంఘ్ పనిని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వివరించారు. అన్ని వయసుల వారు శాఖకు వస్తారని చెప్పారు.
 
సాధారణంగా, స్వయంసేవకులకు సంఘ్‌లో సభ్యత్వం ఉండదని పేర్కొంటూ ఈ సంవత్సరం, రోజువారీ శాఖకు చెందిన స్వయంసేవకులు గురు పూజలో 37 లక్షల మందికి పైగా పాల్గొన్నారని తెలిపారు.
 
ఇలా ఉండగా, మన జీవిత కాలంలో జాతీయ గుర్తింపు కోసం జరిగిన భారీ ఉద్యమం ఫలితంగా సాకారం చెందుతున్న  శ్రీరామ జన్మభూమి ఆలయ పనులు దాదాపు పూర్తయ్యాయి. జనవరి 22న కొత్తగా నిర్మించిన ఆలయంలో శ్రీరామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సర్ సంఘచాలక్,  ప్రధాన మంత్రిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది.
 
ఈ సందర్భంగా, జనవరి 1 నుండి 15 వరకు దేశవ్యాప్తంగా ప్రజలు ఈ చారిత్రాత్మక ఘట్టానికి సాక్షులుగా మారేలా చూసేందుకు, స్వయంసేవకులు శ్రీ రామ జన్మభూమి తీర్థ అందించిన అక్షించాలతో  పాటు శ్రీరామ లల్లా చిత్రాలను ఇంటిని తీసుకెళ్లి ప్రజలను ఆహ్వానిస్తూ సంపర్క్ అభియాన్ నిర్వహిస్తారని హోసబలే తెలిపారు. 
 
అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్, అఖిల భారతీయ సహా ప్రచార ప్రముఖులు నరేంద్ర ఠాకూర్, అలోక్ కుమార్ కూడా హాజరయ్యారు.