ర‌చ‌యిత్రి నందిని దాస్‌కు బ్రిటిష్ అకాడ‌మి బుక్ ప్రైజ్

భార‌త్‌లో జ‌న్మించిన ర‌చ‌యిత్రి నందిని దాస్‌కు అరుదైన గౌర‌వం ల‌భించింది. గ్లోబ‌ల్ క‌ల్చ‌ర‌ల్ అండ‌ర్‌స్టాండింగ్‌లో ప్ర‌తిష్టాత్మ‌క బ్రిటిష్ అకాడ‌మి బుక్ ప్రైజ్ 2023ను ఆమె గెలుచుకున్నారు. కోర్టింగ్ ఇండియా : ఇంగ్లండ్‌, మొఘ‌ల్ ఇండియా అండ్ ఆర్జిన్స్ ఆఫ్ యూర‌ప్ అనే పుస్త‌కానికి గాను ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ నాన్ ఫిక్ష‌న్ ప్రైజ్ ఆమెకు ద‌క్కింది. 
 
అవార్డు కింద 25,000 జీబీపీ విలువైన బ‌హుమ‌తి నందిని దాస్‌కు అంద‌చేయ‌నున్నారు.  లండ‌న్‌లో మంగ‌ళ‌వారం సాయంత్రం బ్రిటిష్ అకాడ‌మిలో జ‌రిగిన వేడుక‌లో ఈ ఏడాది విజేత‌ను వెల్ల‌డించారు. నందిని దాస్ బ్రిట‌న్‌లో విద్యా వేత్త‌గా పేరొందారు.  యూనివ‌ర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫ‌ర్డ్‌లో ఇంగ్లీష్ ఫ్యాక‌ల్టీలో ప‌నిచేస్తున్న‌నందిని (49) 17వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశంలోకి తొలి ఆంగ్ల రాయబారి సర్ థామస్ రో రాక నుంచి మొఘ‌ల్, బ్రిటిష్‌ సామ్రాజ్యం యొక్క మూలాలపై నూత‌న‌ దృక్పథాన్ని ఆవిష్క‌రించడానికి ప్రయత్నించింది.

భారత‌, బ్రిటీష్ రాజకీయ ప్రముఖులు, అధికారులు, వ్యాపారుల సమకాలీన మూలాలను ఉపయోగించడం ద్వారా ఆమె కథకు అసమానమైన తీక్ష‌ణ‌త‌ను ఆపాదించింద‌ని ప్రైజ్ జ్యూరీ ఛైర్ ప్రొఫెస‌ర్ చార్లెస్ ట్రిప్ పేర్కొన్నారు.