
అలిపిరి నడకమార్గాన్ని చిరుతలు వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే దాదాపు 7 చిరుతలు బందించి అడవిలో వదిలి పెట్టినప్పటికీ తాజాగా శుక్రవారం మరో చిరుత కనిపించింది. అలిపిరి నడకమార్గంలో దృశ్యాలను పరిశీలించగా పులి, ఎలుగుబంటి సంచిరిస్తున్నట్టుగా గుర్తించారు.
ఈ నెల 24 నుంచి 27వ తేదీ మధ్యలో ఆ దారిలో ఈ జంతువులు తిరుగుతున్నట్టు అక్కడ అటవీ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో టీటీడీ యాత్రికులను అప్రమత్తం చేసింది. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సమీపంలో వన్యప్రాణులు కనిపించాయి. పులి, ఎలుగుబంటి ఉన్నట్లు నిర్ధారించిన టిటిడి అధికారులు గుంపులుగా తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్రికులు నడక మార్గంలో ప్రయాణించరాదని హెచ్చరిస్తున్నారు.
అలిపిరి నడక మార్గంలో నరశింహస్వామి ఆలయం నుంచి 7వ మైలు ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది భక్తులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. గత మూడు రోజులుగా వేకువ జామున, రాత్రి సమయాలలో చిరుతలు సంచరిస్తున్నట్టుగా గుర్తించారు.
గతంలో దాడులు చేసిన ప్రాంతంలోనే రెండు చిరుతల సంచారాన్ని గుర్తించిన సిబ్బంది. భధ్రతా సిబ్బందిని టీటీడీ అప్రమత్తం చేసింది. నడకదారిలో 24 న రాత్రి 8 గంటల సమయంలో చిరుత సంచారంపై కెమెరా ట్రాప్ లో గుర్తించారు. 10 రోజుల్లో రెండు సార్లు చిరుత సంచారం అందరిలో వణుకుపుట్టిస్తోంది. రాత్రి వేళల్లో భక్తులు అప్రమత్తం ఉండాలని సూచించారు అటవీశాఖ అధికారులు.
More Stories
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం బిజెపి థ్యేయం
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు