
చైనా రక్షణ శాఖ మంత్రి జనరల్ లీ షాంగ్ ఫూను జిన్‌పింగ్ సర్కార్ పదవి నుంచి తొలగించింది. ఆయన అదృశ్యమైన దాదాపు రెండు నెలల తర్వాత చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. లీ షాంగ్ ఫూ ఉద్వాసనకు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిందని పేర్కొంది.
అయితే లీ షాంగ్ ఫూను ఎందుకు పదవి నుంచి తొలగించారు? ఆయన స్థానంలో ఎవర్ని నియమించారనే విషయాలను మాత్రం బయటపెట్టలేదు. జిన్‌పింగ్ ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లీ షాంగ్ ఫూ అదృశ్యం కావడం రెండు నెలల కిందట కలకలం సృష్టించింది. ఆగస్టు 29న బీజింగ్‌లో జరిగిన చైనా – ఆఫ్రికా పీస్ అండ్ సెక్యూరిటీ ఫోరంలో ఆయన చివరిసారిగా కనిపించారు.
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) హార్డ్‌వేర్ ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించిన అవినీతి కేసులపై విచారణ జరుగుతున్న తరుణంలో ఆయన కనిపించకుండా పోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే లీ షాంగ్ ఫూ కనిపించకుండా పోవడానికి కొద్దిరోజుల ముందు ఇలాగే చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ అదృశ్యమయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన్ను పదవిలో నుంచి తీసేసి, ఆ బాధ్యతలను వాంగ్ యీకి అప్పగించారు. వీరిద్దరి తొలగింపునకు కారణాలను వెల్లడించలేదు. జిన్‌పింగ్ అధికారాన్ని వీరిద్దరూ ప్రశ్నించినట్లు తెలుస్తున్నట్లు తెలుస్తున్నది.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్‌లకు భారత్ హెచ్చరిక