ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌

ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌
 
తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ చరిత్రలో మొదటిసారిగా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డును అందుకొని అల్లు అర్జున్ మంగళవారం సరికొత్త చరిత్ర సృష్టించారు. దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు సినిమాలో ఇప్పటివరకు మహామహులే సాధించలేని అరుధైన ఘనతను అల్లు అర్జున్ సాధించి సంచలనం సృష్టించాడు. 
 
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 69వ నేషనల్ అవార్డుల ప్ర‌దానోత్స‌వ‌ వేడుకలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా పుష్ప మూవీలో న‌ట‌న‌కు గాను జాతీయ ఉత్త‌మ న‌టుడి అవార్డు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వీక‌రించారు. తొలిసారి నేషనల్‌ అవార్డ్‌ అందుకోవడం చాలా ఆనందంగా ఉందని అవార్డు అందుకోవడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. 
 
పైగా, కమర్షియల్‌ చిత్రానికి (పుష్ప) జాతీయ అవార్డురావడమనేది డబుల్‌ అఛీవ్‌మెంట్‌ అని పేర్కొన్నారు. ‘పుష్ప’లోని తగ్గేదేలే డైలాగ్‌ చెప్పి అలరించారు ఇక అల్లు అర్జున్‌ అవార్డు తీసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తుంది. కాగా,  ఉత్త‌మ న‌టి అవార్డును అలియా భ‌ల్, కృతి స‌న‌న్ షేర్ చేసుకున్నారు.. ఈ హీరోయిన్స్ కూడా అవార్డును ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు.

ఇక ఉత్త‌మ ప్రాంతీయ చిత్రంగా ఎంపికై ఉప్పెన మూవీకి గాను నిర్మాత నవీన్‌ ఎర్నేని, దర్శకుడు బుచ్చిబాబు సనాలు జాతీయ అవార్డు అందుకున్నారు. అనంతరం  ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా నాటు నాటు పాటకు ప్రేమ్ రక్షిత్, ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా ఎమ్‌.ఎమ్‌. కీరవాణి(ఆర్‌ఆర్‌ఆర్‌), ఉత్తమ సింగర్‌గా కాల భైరవ(ఆర్‌ఆర్‌ఆర్‌), ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్‌(కొండపొలం), ఉత్తమ వీఎఫ్‌ఎక్స్‌కు గానూ శ్రీనివాస్‌ మోహన్(ఆర్‌ఆర్‌ఆర్‌) అవార్డులు అందుకున్నారు.అన్ని వర్గాలను అలరించిన వినోదాత్మక చిత్రంగా ఆర్‌ఆర్‌ఆర్‌కు గానూ రాజమౌళి 69వ నేషనల్ అవార్డును అందుకున్నాడు. ఇక ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ పుష్ప సినిమాకు గానూ అవార్డును అందుకున్నాడు.

ఆగస్ట్‌లో జాతీయ పురస్కారాల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్‌ చరిత్ర సృష్టించారు. టాలీవుడ్‌ చరిత్రలో ఎందరో గొప్ప నటులు ఉన్నా ఎవరికీ దక్కని అవకాశం అల్లు అర్జునకి దక్కింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి ఆరు పురస్కారాలు లభించగా, ‘పుష్ప: ది రైజ్‌’ చిత్రానికి రెండు దక్కాయి. ‘ఉప్పెన’ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ‘కొండపొలం’ సినిమాలోని ‘ధమ్‌ ధమ్‌ ధమ్‌..’ పాటకు చంద్రబోస్‌కు ఉత్తమ గీత రచయితగా అవార్డు దక్కింది.

జాతీయ అవార్డుల పూర్తి జాబితా ఇదే 

ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప)
ఉత్తమ నటి: ఆలియా భట్ (గంగూబాయి) & కృతిసనన్ (మిమీ)
ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ద కశ్మీరీ ఫైల్స్ – హిందీ)
ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠీ (మిమీ- హిందీ)
ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి – మరాఠీ సినిమా)

ఉత్తమ సంగీత దర్శకుడు (సాంగ్స్‌): పుష్ప- దేవిశ్రీ ప్రసాద్
ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌ (బీజీఎమ్‌) :  ఆర్ఆర్ఆర్- ఎమ్.ఎమ్ కీరవాణి
బెస్ట్‌ ఫీచర్‌ ఫిలిం: రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్ (హిందీ)
ఉత్తమ పిల్లల చిత్రం: గాంధీ & కో (గుజరాతీ)
ఉత్తమ కొరియోగ్రఫీ: ఆర్ఆర్ఆర్-ప్రేమ్ రక్షిత్
ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌: ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కతియావాడి)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: ఆర్ఆర్ఆర్-శ్రీనివాస్ మోహన్

బెస్ట్‌ ఫీమేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌: శ్రేయా ఘోషల్ (ఇరవిన్ నిహాల్ – తమిళ మూవీ)
బెస్ట్‌ మేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌: కాలభైరవ (ఆర్ఆర్ఆర్ – కొమురం భీముడో)
ఉత్తమ లిరిక్స్‌: చంద్రబోస్-కొండపొలం మూవీ (తెలుగు)

ఉత్తమ యాక్షన్‌ డైరెక్షన్‌ అవార్డ్‌(స్టంట్‌ కొరియోగ్రఫీ): ఆర్ఆర్ఆర్- కింగ్ సోలమన్
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: వీరా కపూర్ ఏ (సర్దార్ ఉద్దామ్-హిందీ)
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: దిమిత్రీ మాలిక్ & మాన్సి ధ్రువ్ మెహతా (సర్దార్ ఉద్దామ్)
ఉత్తమ ఎడిటింగ్‌: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కతియావాడి మూవీ)

బెస్ట్‌ ఆడియోగ్రఫీ (లొకేషన్‌ సౌండ్‌ రికార్డిస్ట్‌): అరుణ్ అశోక్ & సోనూ కేపీ (చవిట్టు మూవీ-మలయాళం)
బెస్ట్‌ ఆడియోగ్రఫీ (సౌండ్‌ డిజైనర్‌) : అనీష్ బసు (జీలీ మూవీ- బెంగాలీ)
బెస్ట్‌ ఆడియోగ్రఫీ (రీరికార్డిస్ట్‌ ఆఫ్‌ ద ఫైనల్‌ మిక్స్‌డ్‌ ట్రాక్‌): సినోయ్ జోసెఫ్ (సర్దార్ ఉద్దామ్-హిందీ)
బెస్ట్‌ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌): షాహీ కబీర్ (నాయట్టు సినిమా-మలయాళం)
బెస్ట్‌ స్క్రీన్‌ప్లే (డైలాగ్‌ రైటర్‌) : ప్రకాశ్ కపాడియా & ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి)
బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉద్దామ్ మూవీ-హిందీ)
ఉత్తమ చైల్డ్‌ ఆర్టిస్ట్‌: భవిన్ రబరీ (ఛెల్లో షో – గుజరాతీ సినిమా)
బెస్ట్‌ ఫిలిం ఆన్‌ ఎన్వైర్‌మెంట్‌ కంజర్వేషన్‌: అవషావ్యూహం (మలయాళం)
బెస్ట్‌ ఫిలిం ఆన్‌ సోషల్‌ ఇష్యూస్‌: అనునాద్-ద రెజోనెన్స్ (అస్సామీస్)
బెస్ట్‌ పాపులర్‌ ఫిలిం ఆన్‌ ప్రొవైడింగ్‌ హోల్‌సమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌:  ఆర్ఆర్ఆర్
ఇందిరాగాంధీ అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ డెబ్యూ ఫిలిం ఆఫ్‌ ఎ డైరెక్టర్‌: మెప్పాడియన్ (మలయాళం)
స్పెషల్ జ్యూరీ అవార్డ్: షేర్ షా (హిందీ సినిమా)
నర్గీస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్: ద కశ్మీరీ ఫైల్స్ (హిందీ)