
కేంద్రంలో మోదీ సర్కార్ రాకముందు దేశ వ్యాప్తంగా విద్యుత్ కొరత ఉండేదని, ఇప్పుడు వ్యవసాయ రంగానికి దేశంలో ఎక్కడ విద్యుత్ కోతలు లేవని కేంద్రమంత్రి, రాష్త్ర బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఆయన మాట్లాడుతూ, రామగుండం ఎన్టీపీసీకి మోదీనే శంఖుస్థాపన చేశారని, ఆయనే దానిని ప్రారంభం కూడా చేశారని గుర్తు చేశారు.
ఎరువుల సమస్యను తీర్చింది మోదీనేనని అంటూ కొరత, కోతలు లేని నూతన భారతావనిని మోదీ ఆవిష్కరించారని పేర్కొన్నారు. 10 ఎకరాలు ఉన్న రైతుకు ఎరువుల మీద రూ. 2 లక్షల సబ్సిడీ కేంద్రం ఇస్తుందని తెలిపారు. ఎరువుల పరిశ్రమ, ఎన్టీపీసీ ప్రాజెక్ట్ ప్రారంభానికి మోదీ వస్తే కేసీఆర్ ఫాంహౌస్, ప్రగతి భవన్ లో పడుకున్నాడని విమర్శించారు.
కొడుకు సీఎం, అయన జాతీయ నేత కావాలని శ్రద్ద తప్ప కేసీఆర్ కి తెలంగాణ ప్రజల పై లేదని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఓట్ల పైన ధ్యాస తప్ప తెలంగాణ అభివృద్ది పై ఆయనకు చితశుద్ది లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫిజిబిలిటీ కాదు, దాన్ని నిర్వహింపలేమని అంటున్నారని తెలిపారు.
ఇంజనీర్లను పక్కన పెట్టి ఫాంహౌస్ ఇంజనీర్ గా మారి తెలంగాణ ప్రాజెక్ట్ లను కేసీఆర్ ముంచుతున్నాడని కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా ట్రిబ్యునల్ ఆలస్యానికి కారణం కేసీఆరేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సస్యశ్యామలం కావాలి అంటే నదుల అనుసంధానం జరగాలని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలుగా మారాయని విమర్శించారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కేసీఆర్ పాలన చేస్తున్నారని చెబుతూ రాష్ట్రంలో మార్పు రావాల్సి ఉందని చెప్పారు. కేసీఆర్ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారని పేర్కొంటూ రాజకీయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అప్పు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని కిషన్ రెడ్డి తెలిపారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత