
పర్యావరణ పరిరక్షణకు, సామాజిక సామరస్యాన్ని పెంపొందించడానికి, భారతదేశపు సాంప్రదాయ కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ పిలుపిచ్చారు. జమ్మూలో తన మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం జమ్మూలో సంఘ్ పరివార్‌లోని వివిధ సంస్థల సమన్వ బైఠక్‌లో ప్రసంగించారు.
సంఘ్ పరివార్‌కు చెందిన 38 సంస్థలకు చెందిన 105 మంది స్వయంసేవకులు హాజరైన ఈ సమావేశంలో వివిధ సామాజిక అంశాలపై చర్చించారు. ఆర్‌ఎస్‌ఎస్ సందేశాన్ని ప్రతి ఇంటికి చేరేలా సంస్థాగత నెట్‌వర్క్‌లను మరింత విస్తరించాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా తెలియచెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ స్థాపన శతాబ్ది ఉత్సవాల (100వ సంవత్సరం) ముందు సంస్థ నెట్‌వర్క్‌ను విస్తరించడంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. స
సమన్వ బైఠక్‌లో, గ్రామాల అభివృద్, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కోసం జమ్మూ కాశ్మీర్ లో ఆర్ఎస్ఎస్ ప్రారంభించిన వివిధ ప్రాజెక్టులను సర్ సంఘచాలక్ సమీక్షించారు. గ్రామాభివృద్ధికి, సమాజంలో సామాజిక సామరస్యానికి పథకాలు చేపట్టిన స్వయం సేవకులకు ఆయన కొన్ని సూచనలు చేశారు.
కాగా, కేశవ్ భవన్‌లో సేవా భారతి హాస్టల్ విద్యార్థులతో డా. భగవత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లోని ఖైదీలు దేశభక్తి గీతాలను ఆలపించారు. క్షేత్రీయ సంఘచాలక్ సీతా రామ్ వ్యాస్, ప్రాంట్ సంఘచాలక్ డాక్టర్ గౌతమ్ మెంగి కూడా వేదికపై పాల్గొన్నారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు