ఆసియా క్రీడలలో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలసిందే. ఈ క్రీడల్లో భారత్ 107 పతకాలు (28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు) సాధించి పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే ఆసియా క్రీడలలో పాల్గొన్న భారతీయ అథ్లెట్ల బృందంతో ప్రధాని మోదీ సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.
అక్టోబరు 10వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు న్యూ ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఆసియా క్రీడలలో పాల్గొన్న భారతీయ అథ్లెట్ల బృందంతో ప్రధాని మోదీ సంభాషించనున్నారు. అనంతరం ప్రధాని ప్రసంగం చేయనున్నారు. ఈ సందర్భంగా భారతదేశానికి గొప్ప విజయాలు సాధించిన క్రీడాకారులను దేశ ప్రజల తరపున ప్రధాని అభినందించనున్నారు.
ఆసియా క్రీడలలో అత్యుత్తమ విజయాలు సాధించిన క్రీడాకారులను అభినందించేందుకు, భవిష్యత్తులో జరిగే పోటీలకు వారిని ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆసియా క్రీడల చరిత్రలో భారత్ సాధించిన పతకాల సంఖ్య ప్రకారం ఇది దేశ అత్యుత్తమ ప్రదర్శన. దీంతో భారత అథ్లెట్ల ప్రదర్శనపై దేశం మొత్తం గర్విస్తోంది.
ప్రధాని మోదీ హాజరయ్యే ఈ కార్యక్రమానికి ఆసియా క్రీడల కోసం భారత బృందంలోని అథ్లెట్లు, వారి కోచ్లు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధికారులు, జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులు, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ అధికారులు హాజరుకానున్నారు.

More Stories
వందేళ్లైనా జంగల్ రాజ్యాన్ని బిహార్ ప్రజలు మరిచిపోరు
కొత్త సీజేఐ నియామకంపై కసరత్తు!
భారత అంతరిక్ష రంగం 2025లో అద్భుత పురోగతి