మాతా అమృతానందమయిని కలుసుకున్న డా. భగవత్

 
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్  డాక్టర్ మోహన్ భగవత్ మాతా అమృతానందమయి దేవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రకృతి పరిరక్షణ, సేవా కార్యక్రమాల సందేశాలను అందించారు.  కేరళ పర్యటనలో ఉన్న ఆయన కొల్లాంలోని వల్లికవ్ అమృతపురి మఠంలో అమ్మవారిని కలిశారు.
అమ్మ ఆశీస్సులు కోరుతూ ఆమె పుట్టినరోజున  తాను రాలేకపోయానని చెప్పారు. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో అమృతానందమయ్ మఠం చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి అమ్మ వివరించారు.  ప్రకృతి పరిరక్షణ, గోసంరక్షణ, గ్రామాభివృద్, ధర్మ జాగృతిలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల గురించి కూడా ఇద్దరూ సంభాషించారు.
డాక్టర్ భగవత్ ఆదివారం ఆశ్రమానికి వచ్చిన ఆయనకు స్వామి తురీయామృతానందపురి, భవ్యామృతానందపురి, శరణామృతచైతన్య, తపస్యామృతానందపురి, వేదమృతానందపురి స్వాగతం పలికారు.  ఆశ్రయంలో కలరీని సందర్శించి, అనయూట్ (ఏనుగులకు ఆహారం ఇవ్వడం) ప్రదర్శించిన తర్వాత డా. భగవత్ తిరువంతపురంకు తిరిగివచ్చారు.
ఆర్‌ఎస్‌ఎస్ క్షేత్ర సంఘచాలక్ డా. ఆర్. వన్నియారాజన్, ప్రాంత్ సంఘచాలక్ కె.కె. బలరాం, అఖిల భారతీయ సహ సంపర్క్ ప్రముఖ్ రమేష్ పప్పా, కుటుంబ ప్రబోధన్ సమయోజక్ డాక్టర్ రవీంద్ర జోషి తదితరులు కూడా ఆయనతో పాటు ఉన్నారు.  సోమవారం ఉదయం శ్రీపద్మనాభస్వామి ఆలయాన్ని  డా. భగవత్ సందర్శించారు. సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌తో భేటీ కానున్నారు.
అంతకుముందు మోహన్ భగవత్ అమృత ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన సంఘచాలక్ శిబిరంను సందర్శించి సంఘచాలక్‌లను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంజినీరింగ్ కళాశాలలోఆయనకు బ్రహ్మచారి విశ్వనాథామృత చైతన్య, బ్రహ్మచారి అచ్యుతామృత చైతన్య, బ్రహ్మచారి ఓంకామృత చైతన్య స్వాగతం పలికారు.