ఇక, సింగరేణి అప్పీల్‌తో కలిపి కేంద్ర కార్మికశాఖ పిటిషన్‌పై ఈనెల 11న విచారణ చేపట్టనున్నట్టు ఉన్నత న్యాయం స్థానం చెప్పింది. ఎన్నికలను వాయిదా వేయాలని కార్మిక సంఘాలు సింగరేణి యాజమన్యాన్ని కోరింది. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశాయి. దీనిపై అక్టోబర్ 5న విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయ్యే వరకు కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది.
అయితే, ఈ నెలాఖరులోగా కార్మిక సంఘాల ఎన్నికలు పూర్తి చేయాలని ఇప్పటికే సింగిల్ జడ్జి తీర్పు చెప్పింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేస్తూ సింగరేణి అప్పీలుపై తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర కార్మిక శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.

More Stories
గిరిజన సంస్థ పెట్రోల్ బ్యాంకుల్లో అవినీతిపై దర్యాప్తు జరపాలి
ప్రపంచంలోనే తొలి యాంటీ-డ్రోన్ గస్తీ వాహనం ‘ఇంద్రజాల్ రేంర్’
హైదరాబాద్లో శాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ప్రారంభించిన ప్రధాని