
పాకిస్థాన్‌లోని కరాచీలో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ప్రముఖ నేత ముఫ్తీ ఖైసెర్ ఫరూఖ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఫరూఖ్ 26/11 సూత్రధారి , లష్కరే అగ్రనేత హఫీజ్ సయీద్‌కు సన్నిహిత సహచరుడిగా, కుడిభుజంగా ఉంటూ వస్తున్నారు.
ముంబైలో భారీ స్థాయి ఉగ్రవాద దాడులలో హఫీజ్ కీలక వ్యక్తిగా ఉన్నారు. 30 సంవత్సరాల ఫరూక్ హత్య గురించి పాకిస్థాన్ ప్రముఖ పత్రిక డాన్ వార్త వెలువరించింది. ఫరూక్‌ను నిర్ణీతంగా ఎంచుకుని గుర్తు తెలియని వ్యక్తులు కరాచీలోని సమనాబాద్ ప్రాంతంలో ఓ మతపరమైన సంస్థ వద్ద దాడి చేసి కాల్చివేసినట్లు తెలిపారు.
ఫరూక్‌ను వెనుక భాగంలోకి బుల్లెట్లు దూసుకువెళ్లాయి. వెంటనే చికిత్సకు ఆసుపత్రికి తరలించగా, మధ్యలోనే మృతి చెందాడు. శనివారం రాత్రి ఈ హత్య జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఫరూక్ హత్యను తెలియచేసే వీడియో ఫుటేజ్ సామాజిక మాధ్యమాలలో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కాగా, హఫీజ్ సయీద్ కుమారుడు అదృశ్యమైన కొన్ని రోజుల తర్వాత ఖైజర్ ఫరూఖ్ కాల్పుల్లో మరణించడం కలకలం రేపింది.
More Stories
హెచ్-1బి కొత్త ధరఖాస్తులకే లక్ష డాలర్ల రుసుము
ఇరాన్‌పై మరోసారి తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు
ఆపరేషన్ సింధూర్ తో స్థావరాలు మారుస్తున్న జైషే, హిజ్బుల్