
రాజస్థాన్‌లోని నాగౌర్ ప్రాంతంలో మీర్దా, చౌదరి బలమైన నేతలుగా పేరుండటంతో ఆ ప్రభావం రాబోయే ఎన్నికల్లో బలంగా ఉంటుందని బీజేపీ చెబుతోంది. జాతి నిర్మాణ బాధ్యతలకు కాంగ్రెస్ పార్టీ తిలోదకాలు ఇచ్చిందని, పార్టీ నేతలు, కార్యకర్తలను ఆ పార్టీ నిర్లక్ష్యం చేసిందని మీర్దా ఆరోపించారు.
రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేస్తానని ఆమె చెప్పారు. రాష్ట్రంలో పటిష్ట ప్రభుత్వం ఏర్పాటుకు, కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం వచ్చేందుకు పనిచేస్తానని ఆమె తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కీలక నాయకత్వంలో భారత్ గణనీయంగా అభివృద్ధి సాధించిందని ఆమె ప్రశంసించారు.
కాగా, బీజేపీలో తాజా చేరికలతో నాగౌర్ ప్రాంతంలో కాంగ్రెస్ ఫలితాలపై ప్రభావం ఉండవచ్చని చెబుతున్నారు. నౌగర్ లోక్‌సభకు జ్యోతి మీర్దా ఈసారి బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. నాగౌర్ నుంచి ఆరు సార్లు ఎంపీగా ఎన్నికైన నాథూరామ్ మీర్దా మనుమరాలే జ్యోతి మిర్దా. నాగౌర్ ప్రాంతంలో నాథూరామ్ మీర్దాకు గట్టి పట్టు ఉంది.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు