చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు  4 రోజుల జుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్ట్ తీర్పునిచ్చింది.  చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా బ‌ృందం, ప్రభుత్వం తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిల బ‌ృందం సుదీర్ఘ వాదనలు విన్న ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి హిమబిందు తీర్పునిచ్చారు.
దీంతో చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన తాడేపల్లి సిట్ ఆఫీసుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది.  శనివారం ఉదయం నంద్యాలలో అరెస్ట్ చేసిన అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో ఆదివారం ఉదయం హాజరుపరిచగా సుదీర్ఘ వాదోపవాదాలు సుమారు ఎనిమిది గంటలపాటు జరిగాయి.
వాదనల అనంతరం మూడు గంటలకు పైగా సమయం తీసుకున్న న్యాయమూర్తి ఏపీ సిఐడి వాదనలతో అంగీకరిస్తూ రేమండ్ కు ఆమోదం తెలిపారు. ఆర్థిక నేరాలకు బెయిల్ ఇవ్వకూడదన్న సీఐడీ వాదనలకు ఏకీభవించిన కోర్టు తీర్పు వెల్లడించింది.
 
ఇదిలావుండగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ప్రాథమిక ఆధారాలతోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. రూ.271 కోట్ల స్కామ్‌ జరిగిందని, అందులో చంద్రబాబు పాత్ర ఉందని పేర్కొంది. కాగా.. అరెస్ట్ విషయంలో సుమారు 8 గంటలపాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. అనంతరం చంద్రబాబుకు జుడీషియల్ రిమాండ్ విజయవాడ ఏసీబీ కోర్ట్ తీర్పునిచ్చింది. దీంతో ఆయన తరఫు లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
 
అంతకు ముందు గతరాత్రి సుదీర్ఘంగా చంద్రబాబును విచారించిన అధికారులు.. రిమాండ్‌ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. 2021 ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకపోవడంతో తాజాగా ఆయన పేరును పోలీసులు చేర్చారు. ఈ నేపథ్యంలో విజయవాడ కోర్టు ప్రాంగణంలో భారీగా పోలీసులను మోహరించారు. పరిసరాలను మొత్తం పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.
 
స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో చంద్రబాబును ముఖ్య కుట్రదారుగా పేర్కొన్న ఏసీబీ. ఎఫ్ఐఆర్‌లో ఏ37గా పేర్కొంటూ కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించిన ఏసీబీ. కొద్దిసేపటి కిందటే ఆయన పేరును ఎఫ్ఐ‌ఆర్‌లో చేర్చింది. సీమెన్స్ కంపెనీకి ప్రభుత్వ వాటాగా రూ.371 కోట్లు చెల్లించారని, అందులోని 270 కోట్లను షెల్ కంపెనీలకు మళ్లించారని ఆరోపణలు.