ఏపీ వ్యాప్తంగా మెడికల్ షాప్స్ , డ్రగ్ ఏజెన్సిస్, ఫార్మాసిలలో డ్రగ్ కంట్రోలర్ తనిఖీల్లో భారీగా నకిలీ మందుల వ్యవహారం బయటపడింది. ప్రముఖ బ్రాండులకు సంబంధించిన చాల మందులకు నకిలీవి తయారు చేసి అమ్మేస్తున్నారు కేటుగాళ్ళు. క్రమం తప్పకుండా వాడే కార్డియాక్ , ఫీవర్ ,అల్సర్ , బీపీ, షుగర్, గ్యాస్, పెయిన్ లాంటి అన్ని మందులో కల్తీ మందులు వచ్చేస్తున్నాయి.
భారీ ఎత్తున డూప్లికేట్ మందులు గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేసారు. ఇందులో పలువురు వ్యాపారులపై కేసులు కూడా నమోదు చేసారు. హైదరాబాద్ నుండి విజయవాడ గుంటూరు, నెల్లూరు లాంటి ప్రధాన నగరాలకు ఈ నకిలీ మందులు సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. అనుమానం ఉన్న మందుల శాంపుల్స్ తీసి ల్యాబ్ కు పంపుతున్నారు అధికారులు.
ఈ డూప్లికేట్ మందులను తక్కువ ధరకు కొనుగోలు చేసి స్టాండెస్ బ్రాండెడ్ మందులంటూ అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. రీకాల్ చేయబడిన స్టాక్ అన్ని నమూనాలను విశ్లేషణ కోసం డ్రగ్ కంట్రోల్ లాబొరేటరీకి పంపారు. గతంలో కోడెయిన్ సిరాప్స్ మిస్ యూజ్ అయినా సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు కూడా నార్కోటిక్ డ్రాగ్ ఉన్న మెడిసిన్స్ ను ఎలాంటి బిల్స్ లేకుండా అమ్మేస్తున్నారు వ్యాపారాలు. విచ్చలవిడిగా లైసెన్స్ లేని మెడికల్ షాప్స్ బిల్ లేని మందులు అమ్మకాలు, కొనుగోలు జరుగుతున్నట్లు గుర్తించారు.
మత్తుకు బానిసైన వారికీ బిల్స్ లేకుండానే డ్రగ్స్ కంటెంట్ ఉన్న మందుల అమ్మేస్తున్నారు. బెజవాడలో కూడా భారీగా నకిలీ మందులు బయటపడ్డాయి. వన్ టౌన్ , గొల్లపూడిలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు చేశారు. తనిఖీల్లో భారీగా నకిలీ మందులు బయటపడ్డాయి. గొల్లపూడి ,వాసవి ఫార్మా కాంప్లెక్ ,వన్ టౌన్ లో నకిలీ మందులు గుర్తించారు.
తక్కువ ధరకు హైదరాబాద్ నుండి కొనుగోలు చేసి అమ్మకాలు జరుగుతున్నట్లుగా నిర్దారించారు. లైసెన్స్ లేని వ్యక్తులు వ్యాపారం చేసిన అనధికారికంగా మందులు అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఏ బిల్స్ లేకుండా మందులు కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నారు హోల్ సెల్ వ్యాపారులు. ఇలా అమ్మకాలు చేస్తున్న కృష్ణ మూర్తి, నీలి కుమార్ అనే ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Stories
మాజీ మంత్రి జోగి రమేశ్‌కు 13 వరకు రిమాండ్
శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం
పోలవరం నిర్వాసితులకు రూ.1000 కోట్లు విడుదల