ఆత్మాహుతి బాంబర్ మోటార్ సైకిల్‌పై భద్రతా అధికారుల వాహనానికి ఎదురెళ్లి తనను తాను కాల్చుకున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనపై పాకిస్థాన్ తాత్కాలిక పీఎం అన్వర్ ఉల్ హక్ కకర్ విచారం వ్యక్తం చేశారు.
‘బన్నూ డివిజన్‌లో టెర్రరిస్టుల ఆత్మాహుతి దాడిలో 9 మంది సైనికులు మృతి చెందారనే వార్త విని గుండె పగిలింది. అలాంటి చర్యలను ఖండిస్తున్నాను. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ దృఢంగా ఉంది’ అని తెలిపారు. ఈ దాడికి నిషేధిత తెహ్రీక్ – ఏ – తాలిబన్ పాకిస్థాన్ సంస్థ బాధ్యత వహించింది.
కాగా, ఖైబర్ ఫంఖ్తుఖ్వా ప్రావిన్స్ ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. ఈ ఏడాది జులై 30వ తేదీన ఓ రాజకీయ పార్టీ సమావేశంలో ఆత్మాహుతి బాంబర్ పేలుడుకు పాల్పడటంతో 54 మంది మరణించారు. సుమారు 200 మందికి పైగా గాయపడ్డారు.

More Stories
గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌లో చాంపియన్‌గా ప్రజ్ఞానంద
మలేషియా నుండి మయన్మార్ కు 1,500 మంది రోహింగ్యా శరణార్థులు
నేపాల్ లో 547కు చేరిన మృతుల సంఖ్య.. మరో వరద హెచ్చరిక