
ఆత్మాహుతి బాంబర్ మోటార్ సైకిల్‌పై భద్రతా అధికారుల వాహనానికి ఎదురెళ్లి తనను తాను కాల్చుకున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనపై పాకిస్థాన్ తాత్కాలిక పీఎం అన్వర్ ఉల్ హక్ కకర్ విచారం వ్యక్తం చేశారు.
‘బన్నూ డివిజన్‌లో టెర్రరిస్టుల ఆత్మాహుతి దాడిలో 9 మంది సైనికులు మృతి చెందారనే వార్త విని గుండె పగిలింది. అలాంటి చర్యలను ఖండిస్తున్నాను. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ దృఢంగా ఉంది’ అని తెలిపారు. ఈ దాడికి నిషేధిత తెహ్రీక్ – ఏ – తాలిబన్ పాకిస్థాన్ సంస్థ బాధ్యత వహించింది.
కాగా, ఖైబర్ ఫంఖ్తుఖ్వా ప్రావిన్స్ ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. ఈ ఏడాది జులై 30వ తేదీన ఓ రాజకీయ పార్టీ సమావేశంలో ఆత్మాహుతి బాంబర్ పేలుడుకు పాల్పడటంతో 54 మంది మరణించారు. సుమారు 200 మందికి పైగా గాయపడ్డారు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
అవినీతిపై పోరాడతా, ఉద్యోగాలు కల్పిస్తా