శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు సర్వం సిద్దం

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు సర్వం సిద్దం
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా జరిపేందుకు సర్వం సిద్దం చేసినట్లు హరేకృష్ణ గోకుల క్షేత్ర అధ్యక్షులు వంశీధర దాస తెలిపారు. ప్రతి ఏడాది శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు  అంగరంగ వైభోగంగా  వేలాది మంది భక్తుల నడుమ జరుపు కోవడం జరుగుతుందని చెప్పారు. 
 
అదే విధంగా ఈ ఏడాది కూడా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను  వైభోగంగా తాడేపల్లి లోని గోకుల క్షేత్రంలోనే హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతాయని తెలిపారు. ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి, ధర్మ సూత్రములను తిరిగి స్థాపించటానికి తాను ఈ లోకంలో ప్రతి యుగంలో అవతరిస్తాను అని భగవద్గీత లో  శ్రీ కృష్ణుడు చెప్పడం జరిగిందని పేర్కొన్నారు.
 
కృష్ణాష్టమి వేడుకలను సెప్టెంబరు 6, 7వ  తేదీలలో తాడేపల్లి కొలనుకొండ హరేకృష్ణ  గోకుల క్షేత్రం నందు నిర్వహిస్తున్నామని తెలిపారు.  శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు అనగా 6 వ తేదీ ఉదయం 9  గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలవుతాయని చెప్పారు. ఆ రోజు అభిషేకంతో  శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు పూర్తిస్థాయిలో  ప్రారంభిస్తారు. 
 
 శ్రీ కృష్ణ  జన్మాష్టమి   పర్వదినములో నిర్వహించే శుభ కార్యక్రమాల్లో భాగంగా రెండు రోజులు మహా అభిషేకము వైభవముగా నిర్వహిస్తారు. ఈ అభిషేకములో 108 పవిత్ర జల కలశాలతో, పళ్ళ రసాలు, పంచామృతం \, పంచగవ్యాలతో  వివిధ పుష్పాలతో అంగరంగ వైభవముగా అభిషేకం నేత్ర పర్వంగా  జరుగుతుందని వివరించారు.  
 
ఈ అభిషేకాలలో భక్తులు ఆత్మోద్దీపనం కలిగించే కీర్తనలు, కోలాటాలు, పాటలు ఇతర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. బాల గోపాలునికి ఉంజల సేవ ఉంటుందన్నారు. ఈ ఉత్సవంలో భాగముగా  బృందావనం నుంచి వచ్చిన  లడ్డుగోపాలునికి మృదువైన  ఉంజల సేవ నిర్వహించనున్నారు.  ఈ మహా పండగలో కళాకారులతో పాటలు, క్విజ్, డ్రెస్సింగ్ కాంపిటషన్ , డాన్స్ కాంపిటేషన్స్  భగవద్గిత శ్లోక కాంపిటేషన్ ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు  జరుగుతాని పేర్కొన్నారు.
 
 అలాగే హరే కృష్ణ మూవ్మెంట్ అంతర్జాతీయ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ ఏ.సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారికి  అభిషేఖం జరుగుతుందని చెప్పారు. వ్యాసపూజ ఎంతో అద్భుతంగా, నేత్ర పర్వంగ  శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆబాల గోపాలంగా తాడేపల్లిలోని  హరే కృష్ణ గోకుల క్షేత్రంలోనే జరుగుతాయని తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని మన గోకుల క్షేత్రంలో  దాదాపు ౩౦ వేల మందికి అన్నదాన ఏర్పాట్లు చేస్తున్నారు.