
ప్రముఖ మలయాళ సినీ, టివి సీరియల్ నటి అపర్ణ నాయర్ మరణించారు. తిరువనంతపురంలోని తన నివాసంలో ఉరివేసుకున్న స్థితిలో ఆమె మృతదేహం గురువారం రాత్రి ఆమె ఇంట్లో లభించింది. 33 ఏళ్ల అపర్ణ నాయర్ కొన్ని మలయాళ సినిమాలు, అనేక సీరియల్స్‌లో నటించారు.
ఇక్కడి కరమన సమీపంలోని ఆమె ఇంట్లో ఆమె మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు. భర్త, ఇద్దరు పిల్లలతో కలసి అపర్ణ ఆ ఇంట్లో నివసిస్తున్నారు. గురువారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఉరివేసుకుని ఉన్న ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా తమకు అక్కడి నుంచి సమాచారం అందినట్లు పోలీసులు చెప్పారు.
అపర్ణ మరణం గురించి ఆమె సోదరి ఐశ్వర్య మాట్లాడుతూ ‘‘నా సోదరి మరణ వార్త తెలియగానే ఇంటికి చేరుకున్నా. నేను వచ్చే సరికి మెడకు చీర చుట్టి ఫ్యాన్‌కి వేలాడుతూ ఉంది. వెంటనే ఆమెను కిందకు దింపి ఆస్పత్ని తరలించాం. అప్పటికే ఆమె మృతి చెందింది. తన మరణానికి కారణం ఏంటటనేది తెలియడం’’ అని చెప్పింది.
అసహజ మరణంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కుటుంబ తగాదాల కారణంగానే అపర్ణ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
More Stories
ఆర్ఎస్ఎస్ అంకితభావం, సేవకు అరుదైన ఉదాహరణ.. దలైలామా
భీమస్మృతి మనకు మార్గదర్శకం, మనుస్మృతి కాదు
ఐఎస్ఐ కోసం గూఢచర్యంలో యూట్యూబర్ వసీం అరెస్ట్