దాదాపు నెల రోజులుగా కనిపించకుండా పోయిన చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్‌ను అక్కడి ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. ఆయన స్థానంలో వాంగ్ యీని నూతన విదేశాంగ మంత్రిగా నియమించింది. చైనా అధికారిక మీడియా జిన్హువా మంగళవారం ఈ మేరకు వెల్లడించింది.
చివరిసారిగా జూన్ 25న రష్యా, శ్రీలంక, వియత్నాం అధికారులతో సమావేశం సందర్భంగా కిన్ గాంగ్ కనిపించారు. ఆ తర్వాత ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. జర్నలిస్ట్‌తో అఫైర్‌తో మంత్రి ఇటీవల వార్తల్లో నిలిచారు.
కిన్ గాంగ్ కన్పించి నెల రోజులు అవుతున్నా ఇప్పటికీ ఆయన ఆచూకీపై స్పష్టత లేకపోవడం గమనార్హం. చైనా ప్రభుత్వం కూడా దీనిపై స్పందించడం లేదు. మంత్రి మిస్సింగ్‌పై సోషల్ మీడియాలో చర్చించడంపైనా ప్రభుత్వం సెన్సార్ విధించింది.
‘వేర్ ఈజ్ కిన్ గాంగ్’ అని సెర్చ్ చేస్తే ‘నో రిజల్ట్స్’ అని సమాధానం వస్తున్నది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు కిన్‌గాంగ్ అత్యంత సన్నిహితుడు. అధ్యక్షుడితో సాన్నిహిత్యం కారణంగానే కిన్ గాంగ్ వేగంగా ఉన్నత పదవులకు చేరుకున్నారు.

More Stories
కర్బన ఉద్గారాలు గతేడాది కన్నా 1.1 శాతం పెరుగుదల
ట్రంప్‌కు క్షమాపణలు చెప్పిన బీబీసీ
ప్రజల కేంద్రీకృత మార్పులకై వాతావరణ సదస్సులో భారత్ పిలుపు