
ఆ తర్వాత చంద్రయాన్ 3 భూమికి దగ్గరగా ఉన్నప్పుడు, చంద్రునికి ఒక పథంలో వెళ్లడానికి దాని ఇంజిన్లను మళ్లీ మళ్లీ బర్న్ చేసి వరుసగా ఆటిట్యూడ్ (కక్ష్యలో ఎత్తు)ని పెంచే ప్రక్రియ కొనసాగుతోంది. ఇది భూమి నుండి చంద్రుని వైపు మళ్ళిన తర్వాత, చంద్రయాన్ 3లోని ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రునిపై అంతరిక్ష నౌక ఎత్తును తగ్గించడానికి మళ్లీ ఇట్లాంటి ప్రక్రియ చేపట్టి మెళ్లగా ల్యాండ్ అయ్యేందుకు వేగాన్ని తగ్గిస్తారు.
స్పేస్‌క్రాఫ్ట్ ఆగస్టు 5 నాటికి చంద్రుని కక్ష్యకు చేరుకుంటుందని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ తర్వాత, ల్యాండింగ్ ప్రక్రియ కోసం వేచి ఉండాల్సి ఉంటుంది. దీనికి తొలి అవకాశం ఆగస్టు 23న ఉండనుంది. ఇస్రో మొదటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. రోవర్, ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై గడపగల సమయం ప్రతి ఒక్కటి 14 భూమి రోజుల వరకు ఉంటుంది.
ప్రణాళిక ప్రకారం ప్రతిదీ సరిగ్గా జరిగితే ఇస్రో ఆగస్టు 23న చంద్రుని ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుంది. ఆగస్ట్ 24 మరొక ఎంపిక అందుబాటులో ఉంది. అంతకు మించి ఆలస్యమైతే, ఇస్రో కూడా చంద్ర కక్ష్యలో ఉండటానికి ఎంచుకోవచ్చు. ఒక నెల తర్వాత, సెప్టెంబర్‌లో తదుపరి చంద్ర రోజులో ఉపరితలంపై ల్యాండ్ చేయడానికి ప్రయత్నించవచ్చు.
ప్రణాళికాబద్ధమైన మిషన్ వ్యవధి ఒకే చాంద్రమాన దినం. అయితే చంద్ర రాత్రి తర్వాత సౌర ఫలకాలను సూర్యరశ్మి తాకడం వల్ల అంతరిక్ష నౌకను మేల్కొలిపే అవకాశం ఉంది. ఇది జరిగితే చంద్రయాన్ 3 మిషన్‌ను విస్తరించి వీలైనన్ని ఎక్కువ శాస్త్రీయ పరిశీలనలను నిర్వహించాలని ఇస్రో భావిస్తోంది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్