గురూజీగా పేరొందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) రెండవ సర్ సంఘచాలక్ ఎంఎస్ గోవల్కర్ పై సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ పెట్టారన్న ఫిర్యాదుతో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై కేసు నమోదైంది. మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఇండోర్ పోలీసు అధికారి తెలిపారు.
లాయర్, ఆర్ఎస్సెస్ కార్యకర్త రాజేశ్ జోషీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిగ్విజయ్ సింగ్ పై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. దళితులు, ముస్లింలు, హిందువుల మధ్య చిచ్చుపెట్టేందుకు దిగ్విజయ్ సింగ్ ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు.
“దళితులు, వెనుకబడినవారు, ముస్లింలకు సంబంధించి జాతీయ నీటి వనరులు, అడవులు, భూమి హక్కులపై గురు గోల్వాల్కర్ ఆలోచనలు తెలుసా?” అంటూ జూన్ 8న ఆ వర్గాలలో హిందువులు, ఆర్ఎస్ఎస్ పట్ల విద్వేషం నింపేందుకై ఓ పోస్ట్ చేశారు. సమాన అవకాశాలు కల్పించే స్వేచ్ఛను గురూజీ ఎప్పుడూ కోరుకోలేదంటూ ట్విట్టర్ లో ఓ ఫొటోస్టాట్ పేజీని పోస్ట్ చేశారు.
దురుద్దేశ పూర్వకంగానే దిగ్విజయ్ సింగ్ ఈ ట్వీట్ చేసారంటూ ఆర్ఎస్ఎస్ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తీవ్రంగా ఖండించారు. అనవసరపు సామాజిక అశాంతిని కలిగించేందుకు, ఆర్ఎస్ఎస్ పట్ల తప్పుడు అభిప్రాయం కలిగించేందుకు ఉద్దేశించినట్లు ఆయన విమర్శించారు.
వివిధ కులాలకు చెందిన హిందువుల పట్ల, ఆర్ఎస్ఎస్ పట్ల విద్వేషం వ్యాప్తి చేయడంకోసం అంటూ ఇండోర్ కు చెందిన రాజేష్ జోషి ఆ పోస్ట్ కు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది షెడ్యూల్డ్ కులాల వారిని కించపరిచేందుకు, వివిధ కులాలు, మతాలకు చెందిన ప్రజల మధ్య అగాధం సృష్టించేందుకు ఉద్దేశించినది ఉజ్జయినికి చెందిన రాజ్ కుమార్ గావ్రి ఫిర్యాదు చేశారు.
మరోవైపు ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందిస్తూ కాంగ్రెస్ నేతలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి, సమాజాన్ని విభజించాలని ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.
ఆర్ఎస్ఎస్ పట్ల ఇటువంటి దురుద్దేశం ప్రకటనలు దిగ్విజయ్ సింగ్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆర్ఎస్ఎస్ ను ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ అఫ్ ఇండియా (పిఎఫ్ఐ)తో పోల్చారు. ఆర్ఎస్ఎస్, పిఎఫ్ఐ ఒకే నాణేనికి రెండు ముఖాలన్ని ఆరోపించారు. దేశవ్యాప్తంగా పిఎఫ్ఐ ప్రదేశాలపై ఎన్ఐఏ సోదాలు చేస్తూ, వంద మందిని పైగా అరెస్ట్ చేస్తున్న సమయంలో ఈ వాఖ్య చేశారు.
.

More Stories
కశ్మీర్ రాజ్యసభ ఎన్నికల్లో ఎన్సీని అడ్డుకున్న బీజేపీ
లింగ నిష్పత్తిలో కేరళ ఆదర్శవంతం
బీహార్ లో అన్ని ఎన్నికల రికార్డ్లను బ్రేక్ చేస్తాం