జైన పీఠాధిపతి కాంకుమార్ నంద్ మహరాజ్‌ను చివరిసారి ఆయన భక్తులు జులై 5వ తేదీ సాయంత్రం చూశారు. శుక్రవారం ఆయన కనిపించకపోవడంతో గాలించిన భక్తులు చివరకు పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. జైన స్వామి వద్ద డబ్బులు అప్పు తీసుకున్న ఒక వ్యక్తి దాన్ని ఎగ్గొట్టిన విషయం పోలీసుల దర్యాప్తులో బయటపడింది.
ఆ వ్యక్తే తన మిత్రుడి సాయంతో స్వామీజీని హత్య చేసి శవాన్ని పాడుబడిన బావిలో పడేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. స్వామీజీ ఆచూకీ కోసం ఫిర్యాదు అందిన నాలుగు గంటల్లోనే కేసును ఛేదించినట్లు జిల్లా ఎస్‌పి సంజీవ్ పాటిల్ తెలిపారు.
గత కొద్ది రోజులుగా స్వామీజీనే అంటిపెట్టుకుని తిరుగుతున్న అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తాను, మరో వ్యక్తి కలసి స్వామీజీని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని ఆయన చెప్పారు. నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు ఈ హత్య వెనుక మరెవరి ప్రమేయమైనా ఉందన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

More Stories
ఎన్సీఈఆర్టీ పాఠ్యగ్రంధంపై సుప్రీంకోర్టు నిషేధం
గ్రహ సరిహద్దులు దాటుతున్న వాతావరణ సంక్షోభం
నిరసన ప్రదర్శనలతో కేరళ ఆరోగ్యమంత్రికి గాయాలు