
బీఆర్ఎస్ -బీజేపీ ఒక్కటయ్యాయని తమపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి బరిగీసిన ఎకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. బిజేపీపై కొందరు విషంగక్కే ప్రయత్నం చేస్తున్నారని,గుడ్డి ద్వేషంతో అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వరంగల్ పర్యటన సందర్భంగా సభ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటి సారి ఓరుగల్లు గడ్డమీదకు ప్రధాని మోదీ వస్తున్నారని గుర్తు చేశారు. పార్లమెంట్‌కు ఎంపీని పంపించి బీజేపీ పార్టీని అక్కున చేర్చుకున్న గడ్డ వరంగల్ అని పేర్కొంటూ ప్రజలకు నేనున్నాననే భరోసా ఇవ్వడానికి ప్రధాని వరంగల్‌కు వస్తున్నారని చెప్పారు.
వరంగల్ లో ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేస్తామని చెబుతూ ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపిచ్చారు. అయితే, అసహనంలో కొంతమంది బీజేపీపై విషం కక్కుతున్నారని, కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది వ్యక్తులు, యూ ట్యూబ్ చానల్స్ బీజేపీ పని అయిపోయిందని అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డమీద బీజీపీ జెండా ఎగరాలని ప్రధాని మోదీ తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సూచించారని చెబుతూ అమిత్ షా సహకారంతో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేస్తామని రాజేందర్ భరోసా వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితిల్లోనూ కేసీఆర్ కుటుంబ పాలనను వదిలే ప్రసక్తే లేదని, దోపిడీని వదలబోమని హెచ్చరించారు.
చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని మాజీ మంత్రి తేల్చి చెప్పారు. కాలేశ్వరం ప్రాజెక్టులో జరిగిన దోపిడీ అందరికీ తెలిసిందేనని తెలిపారు. దేశంలో కుుటంబ పార్టీలు వారి కుటుంబాల కోసమే పని చేస్తాయని చెబుతూ బీజేపీ కుటుంబ పార్టీ కాదని స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేసే ఏకైక పార్టీ బీజేపీ అని చెప్పారు.
చాప కింద నీరులా బీజేపీ కార్యకర్తలు పని చేస్తున్నారని, కుట్రలు, కుతంత్రాలు తిప్పి కొట్టే సత్తా తెలంగాణ జాతికి ఉందని ఈటల రాజేందర్ చెప్పారు. తెలంగాణ గడ్డ మీద 2019 పార్లమెంట్ ఎన్నికల నుంచి బీజేపీ జైత్రయాత్ర మెుదలైందని పేర్కొంటూలక్ష్మణ్ సారథ్యంలో 4 పార్లమెంట్ స్థానాలు గెలుచుకొని సత్తా చాటామని గుర్తు చేశారు.
చాప కింద నీరులా బీజేపీ కార్యకర్తలు పని చేస్తున్నారని, కుట్రలు, కుతంత్రాలు తిప్పి కొట్టే సత్తా తెలంగాణ జాతికి ఉందని ఈటల రాజేందర్ చెప్పారు. తెలంగాణ గడ్డ మీద 2019 పార్లమెంట్ ఎన్నికల నుంచి బీజేపీ జైత్రయాత్ర మెుదలైందని పేర్కొంటూలక్ష్మణ్ సారథ్యంలో 4 పార్లమెంట్ స్థానాలు గెలుచుకొని సత్తా చాటామని గుర్తు చేశారు.
ఆ తర్వాత జరిగిన దుబ్బాక, హుుజరాబాద్ ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ, వరంగల్ కరీంననర్, నిజమాబాద్ స్థానిక సంస్థలు, హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ, మునుగోడులో నైతిక విజయం సాధించామని వివరించారు. మునుగోడులోనూ నైతికంగా బిజెపినే గెలిచిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ, లేదంటే డబ్బులతో బీఆర్ఎస్ గెలిచిందని, అంతే కానీ కాంగ్రెస్ ఎక్కడా విజయం సాధించలేదని చెప్పారు.
చాప కింద నీరులా తెలంగాణ అంతటా బీజేపీ విస్తరిస్తుందన్న ఈటల ఇప్పటికే పార్లమెంట్ పరిధిల్లో ఇంఛార్జులను నియమించినట్లు వెల్లడించారు. తాము ప్రజాక్షేత్రంలోకి వెళ్తే బీజేపీకే ఓట్లు వేస్తామని ప్రజలు చెబుతున్నారని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితులోనూ కుట్రలను తిప్పి కొడతామని చెబుతూ వారి మభ్య మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరని భరోసా వ్యక్తం చేశారు. మంచి చెడు తెంలగాణ జాతికి తెలుసుని చెప్పారు. తెలంగాణ ప్రజలను కూడా మాయమాటల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
More Stories
జీఎస్టీ సంస్కరణలు పొదుపు పండుగ లాంటిది
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం