
అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ”మర్యాద పురుషోత్తమ్ శ్రీ రామ్ ఎయిర్పోర్ట్” నిర్మాణం వచ్చే సెప్టెంబర్ నాటికి పూర్తికానుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సుమారు రూ.350 కోట్ల వ్యయంతో అభివృద్ధి పరుస్తున్న ఈ విమానాశ్రయం ఎ 320/బి-737 తరహా విమానాల రాకపోకలకు అనువుగా ఉంటుందని చెప్పింది.
అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న రన్‌వేను 1500 మీ x 30మీ నుంచి 2200మీ x 45మీ వరకూ విస్తరించడంతో పాటు ఇంటెరిమ్ టెర్మనల్ బిల్డింగ్, ఏటీసీ టవర్, ఫైర్ స్టేషన్, కార్ పార్కింగ్, వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్టు తెలిపింది.
”కొత్త ఇంటెరిమ్ టెర్నినల్ బిల్డింగ్ 6250 చదరపు కిలోమీటర్ల ఏరియాలో విస్తరించి ఉంటుంది. రద్దీ సమయంలో 300 మంది ప్రయాణికులకు ఇందులో ఉండే అవకాశం ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం 8 చెక్-ఇన్-కౌంటర్లు, 3 కన్వేయర్ బెల్ట్‌లు (డిపార్చర్ హాలులో 1, అరైవల్ హాల్లో రెండు), 75 కార్లు నిలిపి ఉంచే కార్ పార్కింగ్, ద్విచక్ర వాహనాల పార్కింగ్ ఉంటుంది” అని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.
More Stories
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!
జమ్మూ కాశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
మొబైల్ ద్వారా ఆధార్ సేవలకు ఓ కొత్త యాప్