తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి క్యూకడుతున్నారు. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నాగర్ కర్నూల్‌లో బహిరంగ సభ నిర్వహించగా, తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే నెల 8న ఆయన వరంగల్ లో పర్యటించనున్నారు.
రైల్వేశాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వేగన్ ఓవర్ హాలింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసే బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. మోడీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్నారు.
200 ఎకరాల్లో రూ. 10 వేల కోట్లతో టెక్స్ టైల్ పార్కును కేంద్ర ప్రభుత్వం నిర్మించబోతోంది. ఈ నేపథ్యంలో 8న హైదరాబాద్‌లో జేపీ నడ్డా అధ్యక్షతన జరగాల్సిన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం వాయిదా పడింది.
ఇటీవల మధ్యప్రదేశ్‌లో సీఎం కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రత్యక్షంగా విమర్శలు చేసిన మోదీ ఈసారి వరంగల్ పర్యటనలో ఏ విధంగా విమర్శలు గుప్పిస్తారనేది ఆసక్తిగా మారింది. ఈ మధ్య బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటే అంటూ కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుండగా, ఆ రెండు పార్టీలే నాటకం ఆడుతున్నట్లు బీజేపీకి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

More Stories
ఖమ్మంలో సీపీఎం నేత దారుణ హత్య
అజారుద్దీన్‌కు మంత్రిపదవితో కాంగ్రెస్ లో అసమ్మతి కుంపటి!
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం తడిచి రైతులు విలవిల