జమ్ముకశ్మీర్ కుప్వారాలో నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన యత్నాలను భద్రతా బలగాలు శుక్రవారంనాడు విజయవంతంగా తిప్పికొట్టాయి.నలుగురు ఉగ్రవాదులను  మట్టుబెట్టాయి. కుప్వారాలోని మచల్​ సెక్టార్ లో గల నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీపంలో పోలీసులు, ఆర్మీ అధికారులు ఈరోజు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. 
 
ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ లో నియంత్రణ రేఖ గుండా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది గుర్తించి వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.
కాగా,  గత శుక్రవారంనాడు కూడా భద్రతా బలగాలు చొరబాటుదారుల యత్నాలను తిప్పికొట్టాయి.  కుప్వారా జిల్లాలోని జుమాగుండ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు పాకిస్థాన్ ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. మరోవైపు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా జమ్మూలో పర్యటిస్తు్న్నారు. ఒకరోజు పర్యటన కోసం జమ్మూ చేరుకున్న అమిత్‌షాకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్వాగతం పలికారు.