
గంటకు 140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలుల భీభత్సపు తుపాన్ దశలో అధికార యంత్రాంగం, ఇతరత్రా కలిసికట్టుగా వ్యవహరించడంతో ప్రాణనష్టం జరగలేదని, ఆస్తి నష్టాన్ని కూడా తగ్గించారని ఈ సందర్భంగా అమిత్ షా జట్టు స్పూర్తి క్రమంతో సాగినందుకు అందరిని అభినందించారు. అరేబియా సముద్రంలో భారీ తుపాన్‌గా తలెత్తిన బిపొర్‌జాయ్ ఇప్పుడు తీరం తాకిన తరువాత బలహీనపడి రాజస్థాన్ వైపు తరలివెళ్లింది.
గుజరాత్ తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. ఒక్కటి రెండు రోజులు పలు గ్రామాలు విద్యుత్ సరఫరాకు ఆటంకాలతో చీకట్లో మగ్గాయి. అయితే అధికార యంత్రాంగంతో పూర్తిస్థాయిలో ఎక్కడికక్కడ సమన్వయంతో వ్యవహరించిందని, ఇది నిజంగానే సత్ఫలితాలకు దారితీసిందని ఏరియల్ సర్వే తరువాత అమిత్ షా విలేకరుల సమావేశంలో తెలిపారు.
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు చక్కని సమన్వయం ప్రదర్శించాయని , దీనితోనే ప్రాణనష్టం లేకుండా గండం గడిచిందని, విపత్తుల దశల్లో ఇటువంటి టీంవర్క్ అత్యవసరం చెప్పారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మార్గదర్శకాల మేరకు సరైన రీతిలో సహాయక చర్యలు చేపట్టారని, క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం ఉండటం వల్ల భారీ నష్టం జరగలేదని పేర్కొన్నారు.
దాదాపు 47 మంది స్వల్పంగా గాయపడ్డారని, ఎవరూ చనిపోలేదని, 234 పశువులు చనిపోయినట్లు అమిత్ షా తెలిపారు. ఈ సందర్భంగా హోం మంత్రి సహాయక బృందాల అధికారులను, వివిధ స్థాయిల సిబ్బందిని ప్రత్యేకంగా అమిత్ షా అభినందించారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు