తీవ్ర తుఫానుగా గుజరాత్ తీరంవైపుకు బిపర్‌జోయ్

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్‌ తుఫాను మంగళవారం మరింత బలహీనపడి తీవ్ర తుఫాన్‌గా మారింది. ముంబైవైపు కాకుండా ఉత్తరదిశగా కదిలి గుజరాత్‌ వైపు తిరిగినట్లు ఐఎండీ వెల్లడించిన మ్యాపుల ద్వారా తెలుస్తోంది. బిపోర్‌జాయ్ తుపాను క్ర‌మ‌క్ర‌మంగా గుజ‌రాత్ ను స‌మీపిస్తున్న కొద్ది దాని ఉదృతి పెరిగిపోతున్న‌ది.. తీరం దాటే సమయంలో తీవ్ర విధ్వంసం సృష్టించే సామర్థ్యం దీనికి ఉందని భారత వాతావరణ శాఖ ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.
గుజరాత్‌లోని జఖౌ తీరంలో గురువారం సాయంత్రం ఈ తుపాను తీరం దాటనున్న నేప‌థ్యంలో ఇప్పటికే గుజ‌రాత్ తీర‌ప్రాంతం చిగురుటాకుల వ‌ణికిపోతున్న‌ది.. ద్వార‌క‌లో బ‌ల‌మైన గాలులు వీస్తున్నాయి. స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మార‌డంతో పెద్ద ఎత్తున్న‌ అల‌లు ఎగిసిప‌డుతున్నాయి. పోరుబంద‌ర్‌తో పాటు ద్వార‌క జిల్లాల్లో గాలి వేగం పుంజుకుంటున్న‌ది. ఆ జిల్లాల్లో గాలి వేగం గంట‌కు 75 కిలోమీట‌ర్లు వేగంతో వీస్తున్న‌ది
మంగళవారం ఉదయానికి తుపాను పోర్ బందర్ కు వాయువ్యంగా 300 కిమీల దూరంలో, దేవభూమి ద్వారకకు దక్షిణ – వాయువ్యంగా 290 కిమీల దూరంలో, జఖావు పోర్ట్ కు దక్షిణ – వాయువ్యంగా 340 కిమీల దూరంలో, పాకిస్తాన్ లోని కరాచీకి దక్షిణంగా 480 కిమీల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
 జూన్ 14 ఉదయం వరకు ఇది ఉత్తరంగా ప్రయాణించి, ఆ తరువాత ఉత్తర – ఈశాన్య దిశగా దిశను మార్చుకుంటుందని వాతావరణ శాఖ వివరించింది.
జూన్ 15న గుజరాత్ లోని జూన్ 14 ఉదయం వరకు ఇది ఉత్తరంగా ప్రయాణించి, ఆ తరువాత ఉత్తర – ఈశాన్య దిశగా దిశను మార్చుకుంటుందని వాతావరణ శాఖ వివరించింది. జూన్ 15 సాయంత్రం గుజరాత్ లోని మాండవి, పాకిస్తాన్ లోని కరాచీకి మధ్య, అత్యంత తీవ్రమైన తుపానుగా తీరం దాటే అవకాశముందని వెల్లడించింది. ఆ సమయంలో గంటకు 125 కిమీల నుంచి 135 కిమీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. గాలుల వేగం గంటకు 150 కిమీల వరకు వెళ్లవచ్చని తెలిపింది.
 
యిప్పటికే కచ్, సౌరాష్ట్ర తీరాలలో ఆరంజ్ అలెర్ట్ ను ప్రకటించారు. తుఫాన్ సంసిద్ధతపై  కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వీడియోలో సమీక్ష నిర్వహింపనున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, తుఫాన్ ప్రభావంకు గురికాగల ప్రాంతాల ఎంపీలు కూడా పాల్గొంటారు.  తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
గుజరాత్ కచ్ తీరంలో తుఫాను కారణంగా 144 సెక్షన్ విధించారు. తుఫాన్ గురువారం తీరం దాటే అవ‌కాశాలు ఉండ‌టంతో తీరం వెంట ఉన్న సుమారు 8 వేల మందిని ఇప్ప‌టికే సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. మ‌రో 48 గంట‌ల‌లో బిపర్‌జాయ్ తుఫాన్ గుజ‌రాత్ తీరాన్ని తాక‌నున్న నేప‌థ్యంలో రైల్వే శాఖ ముందు జాగ్ర‌త్త చర్య‌గా 67 రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
త్రివిధ ద‌ళాల‌ల‌ను ర‌క్ష‌ణ కోసం సిద్దం చేశారు. ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు గుజ‌రాత్ తీరం వెంబ‌డి మోహ‌రించారు. నావికాద‌ళంతో పాటు కోస్ట్ గార్డు సిబ్బంది నిరంత‌రం అప్ర‌మత్తంగా ఉంటూ ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు.  విద్యుత్, టెలిఫోన్, సెల్,ఇంట‌ర్నెట్ సేవ‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డే అవ‌కాశాలున్నాయి..
తుఫాను ప్రభావంతో ముంబై తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. వర్లీ తీర ప్రాంతంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. జుహు బీచ్‌వైపు రాకాసి అలలు దూసుకొస్తున్నాయి. దాంతో ముంబై కోస్ట్ గార్డు అధికారులు అప్రమత్తమయ్యారు. పర్యాటకులు బీచ్‌ వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బీచ్‌కు వెళ్లే దారుల్లో భారీగా కోస్ట్‌ గార్డు సిబ్బందిని మోహరించి పర్యాటకులను తిప్పి పంపుతున్నారు.