
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానం మేరకు ఈనెల 12న న్యూఢిల్లిలో ఆమెతో భేటీ అయ్యేందుకు విశాఖ నుంచి ఏపీకి చెందిన 180 మంది గిరిజనులు తరలివెళ్లారని గిరిజన సంస్కతిక పరిశోధన, శిక్షణ సంస్థ మిషన్ డైరెక్టర్ ఈషా రవేంద్రబాబు తెలిపారు.
రాష్ట్రపతితో భేటీకి దేశవ్యాప్తంగా 1500 మందిని ఎంపిక చేయగా, అందులో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఐటిడిఏల నుండి 180 పివిటిజి గిరిజనులు ఉన్నారని తెలిపారు. దేశంలో అభివద్ధికి దూరంగా, అత్యంత దయనీస్థితిలో జీవనం సాగిస్తున్న ఆదిమ జాతి గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఈ సమావేశానికి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటిడిఏ నుండి దొంగ్రియా బోన్డ్, బోడో గదబ, గొట్టోబ్ గదబ, భోన్డ్ పోర్ట, కొండా రెడ్డి, కుట్టి బోన్డ్, పారంగి పోర్ట్ల తదితర ఏడు తెగలకు చెందిన 120 మంది, పార్వతీపురం ఐటిడిఎ నుంచి బోడో గదబ, గొట్టోబ్ గదబ రెండు తెగలకు చెందిన 30 మంది ఎంపికయ్యారు.
అదేవిధంగా, రంపచోడవరం, చింతూరు ఐటిడిఏ నుండి కొండా రెడ్డి తెగకు చెందిన 18 మంది, సీతంపేట ఐటిడిఎ నుంచి కొండ సవర తెగకు చెందిన 10 మంది, కె ఆర్ పురం ఐటిడిఎ నుంచి కొండారెడ్డి తెగకు చెందిన ఇద్దరిని ఎంపిక చేశారు.
వీరికోసం ఈనెల 9వ తేదీన అర్థరాత్రి 12:25 గంటలకు విశాఖపట్నం నుండి న్యూఢిల్లీ వెళ్లే హీరాకుడ్ రైలు ఎక్స్‌ప్రెస్‌లో మూడు ప్రత్యేక అదనపు ఎసి బోగీలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారులతో మాట్లాడి ఏర్పాట్లు చేశారని ఈసా రవీంధ్రబాబు తెలిపారు.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ