వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఆలయ నిర్మాణం, ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ల విస్తరణ సహా మౌలిక సదుపాయాల కల్పనకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
సహదత్‌గంజ్ నుంచి నయా ఘాట్ వరకు 13 కి.మీ.రహదారి పనులు కొనసాగుతున్నాయని పేర్కొంది. రామ జానకి పథ్, భక్తి పథ్ నిర్మాణానికి నమూనా పూర్తయినట్లు వెల్లడించింది. రామజన్మ భూమి పథ్ రోడ్ 30 మీటర్ల వెడల్పు, భక్తిపథ్ రోడ్ 14 మీటర్ల వెడల్పులో నిర్మిస్తున్నారు. ఈ రెండు కారిడార్లు శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గర్హి ఆలయానికి భక్తుల రాకపోకలను సులభతరం చేయనున్నాయి.
రామాలయం ప్రారంభోత్సవానికి రావాలని ప్రజలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద్ ఆహ్వానించారని ప్రభుత్వం తెలిపింది. ఆలయ పనుల పురోగతిని సీఎం క్రమం తప్పకుండా సమీక్షిస్తున్నారని పేర్కొంది. అయోధ్య అభివృద్ధి కోసం ప్రభుత్వానికి మద్దతుగా షాపుల వారు తమ భూములను ఎలాంటి ప్రతిఘటన లేకుండా అప్పగించారని ప్రభుత్వం ప్రకటించింది. ఎవరైతే ఈ నిర్మాణాల వల్ల షాపులను కోల్పోయారో వారికి కొత్తగా నిర్మించిన కాంప్లెక్సుల్లో షాపులు కేటాయించారు.

More Stories
కశ్మీర్ టైమ్స్ ఆఫీస్లో ఏకే-47 క్యాట్రిడ్జ్లు
ఎన్ఐఏ కస్టడీకి నలుగురు ఢిల్లీ పేలుడు కీలక నిందితులు
భారత్కు రష్యా 5 జనరేషన్ ఎస్యు -57 సాంకేతికత