జల్లికట్టుకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు

ఎద్దులను లొంగదీసుకునే క్రీడ ‘జల్లికట్టు’కు సంబంధించిన తమిళనాడు చట్టం చెల్లుబాటును సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది. న్యాయమూర్తి కె.ఎం. జోసఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మహారాష్ట్ర, కర్ణాటక చట్టాలలో కూడా ఎటువంటి చట్టవిరుద్ధత లేదని నిర్ధారించింది. అక్కడి ఎద్దుల బండ్ల పందెం, కంబళాను అనుమతించింది.

జల్లికట్టు పోటీలపై  ఎలాంటి నిషేదం లేదని చెప్పింది.  రాజ్యాంగ ధర్మాసనం కొట్టేసింది. జల్లికట్టు క్రీడను, మహారాష్ట్రలో ఎద్దుల బండ్ల పోటీలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. జల్లికట్టు తమిళనాడు సంస్కృతిక వారసత్వంలో భాగమని అసెంబ్లీ ప్రకటించినప్పుడు, న్యాయవ్యవస్థ అందుకు భిన్నమైన అభిప్రాయాన్ని తెలపదని వ్యాఖ్యానించింది.

తమిళనాడులో ‘జల్లికట్టు’ కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్నదని, జంతువుల పట్ల ఎలాంటి క్రూరత్వం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టినట్లు కూడా తెలిపింది. ‘తమిళనాడు చట్టం చెల్లుబాటవుతుంది, అందులో ఎలాంటి తప్పు లేదు’ అని న్యాయమూర్తి అనిరుద్ధ బోస్ ధర్మాసనం తరఫున ప్రకటించారు. క‌ర్నాట‌క‌లో జ‌రిగే కంబాలా, మ‌హారాష్ట్ర‌లో జ‌రిగే బుల్ కార్ట్ రేసింగ్‌ల‌కు కూడా సుప్రీంకోర్టు అనుమ‌తి ఇచ్చింది.

మూడు రాష్ట్రాలు ఆమోదించిన సవరణ చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం కూడా లభించిందని, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించరాదని కోర్టు పేర్కొంది. న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, హృషికేశ్ రాయ్, సిటి. రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం కూడా రాష్ట్ర చట్టాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 ప్రకారం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించవని ప్రకటించింది.

జంతు హింస చట్టం జల్లికట్టుకు వర్తించదని తెలిపింది.  జల్లికట్టు తమిళనాడు  ప్రతీక అని..  పోటీల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తామని కోర్టుకు లిఖిత పూర్వక హామీ ఇచ్చింది తమిళనాడు ప్రభుత్వం. ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు క్రీడను నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే.  త‌మిళ‌నాడులో పాపుల‌ర్ అయిన జ‌ల్లిక‌ట్టు క్రీడ‌పై 2014 మేలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పును ఇచ్చింది. జంతు చట్టాల‌ను ఉల్లంఘించిన‌ట్లు అప్ప‌ట్లో కోర్టు పేర్కొన్నది.

జ‌ల్లిక‌ట్టు ఆట త‌మిళ‌నాడు సంప్ర‌దాయం కాద‌ని తెలిపింది. త‌మిళ‌నాడు జ‌ల్లిక‌ట్టు నియంత్ర‌ణ చ‌ట్టాన్ని కూడా సుప్రీం ర‌ద్దు చేసింది. అయితే పీసీఏ చ‌ట్టం నుంచి జ‌ల్లిక‌ట్టు ఆట‌ను తొల‌గిస్తూ 2016లో కేంద్ర స‌ర్కార్ కొత్త నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఆ త‌ర్వాత 2017లో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కొత్త జంతు చ‌ట్టాన్ని రూపొందించింది. ఆ నోటిఫికేష‌న్లు, స‌వ‌ర‌ణ‌ల‌ను స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసులు దాఖ‌ల‌య్యాయి.

అయితే ఆ చ‌ట్టాలు ఆర్టిల్ 51ఏ(జీ), 51ఏ(హెచ్‌)ను ఉల్లంఘించ‌లేద‌ని, త‌ద్వారా రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 14, 21ల‌ను కూడా అతిక్ర‌మించ‌లేద‌ని సుప్రీంకోర్టు తెలిపింది. దీనిని ఎద్దులను మచ్చిక చేసుకునే క్రీడగా చెబుతారు. జల్లికట్టును అనుమతిస్తూ 2017 లో చట్టం చేసింది తమిళనాడు ప్రభుత్వం. సుప్రీం తీర్పుతో తమిళనాడులో సంబరాలు చేసుకుంటున్నారు ప్రజలు. టపాసులు పేలుస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.