
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు వైసీపీ ప్రభుత్వం భారీ షాకిచ్చింది. విజయవాడలో కరకట్టపై చంద్రబాబు గెస్ట్‌హౌస్ ను ప్రభుత్వం అటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెండమెంట్ 1944 చట్టం ప్రకారం ఈ భవనాన్ని అటాచ్ చేసినట్లు అధికారులు తెలిపారు. క్రిమినల్ లా అమెండమెంట్ 1944 చట్టం ప్రకారం ఈ భవనాన్ని అటాచ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రిగా నారాయణ తమ పదవులను దుర్వినియోగం చేసి క్విడోప్రోకోకు పాల్పడ్డారని విచారణ తేలిందని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్లలో అవకతవకలకు పాల్పడి, అందుకు బదులుగా కరకట్టపై లింగమనేని గెస్ట్‌హౌస్ పొందారని సీఐడీ అభియోగించింది.
చట్టాలు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించారంటూ విచారణలో తేలిందని సీఐడీ అధికారులు తెలిపారు. తమ పదవులను ఉపయోగించుకుని బంధువులకు, సన్నిహితులకు ప్రయోజనాలు కల్పించేలా వ్యవహరించారని అభియోగించారు. వ్యాపారి లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్ తీసుకున్నారని చంద్రబాబుపై అభియోగం ఉందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో క్రిమినల్ లా అమెండమెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ చేయాలని సీఐడీ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. చట్టం ప్రకారమే చంద్రబాబు గెస్ట్ హౌస్ ను అటాచ్ చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. స్థానిక జడ్జికి సమాచారం ఇచ్చి కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్ అటాచ్ చేసినట్లు వెల్లడించారు.
More Stories
డిల్లీ స్కామ్ కంటే ఏపీ లిక్కర్ స్కామ్ పది రెట్లు పెద్దది
కృష్ణానదిపై తొమ్మిది వంతెనల నిర్మాణంకు సన్నాహాలు
షేర్ల బదిలీపై జగన్, భారతి ఆరోపణలు ఖండించిన విజయమ్మ