గాజా నగరంలో మంగళవారం ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూపుపై ఇజ్రాయెల్ దళాల దాడిలో ముగ్గురు ఇస్లామిక్ జిహాదీ కమాండర్లు హతమయ్యారు. ఈ దాడిలో మొత్తం 13 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు వెల్లడించారు. మృతుల్లో కమాండర్ల భార్యలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో 20 మంది గాయపడ్డారు. మిలిటెంట్లు లక్ష్యంగా భారీ ఆపరేషన్ చేపట్టినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. అత్యంత జనసమ్మర్ధం కలిగిన ప్రాంతాల్లో ఈ దాడి జరిగింది.
దీనికి ప్రతీకారంగా ఇస్లామిక్ జీహాదీలు ప్రతీకార దాడులు చేయనున్నట్టు ఇజ్రాయెల్ హోమ్ ఫ్రంట్ కమాండ్ వెల్లడించారు. నగరాల్లోని స్కూళ్లు, బీచ్‌లు, జాతీయ రహదార్లను మూసివేయాలని ఆదేశాంచారు. ముగ్గురు మిలిటెంట్లను టార్గెట్ చేసేందుకు పది కేంద్రాలను తమ విమానాలు పేల్చివేశాయని ఇజ్రాయెల్ పేర్కొంది. 6 ఇస్లామిక్ జిహాదీ కేంద్రాలను కూడా ధ్వంసం చేశారు.
కలహండిలో ముగ్గురు మావోయిస్టులు హతం
కాగా, ఒడిశా కలహండి జిల్లా అడవుల్లో మంగళవారం పోలీస్‌లకు , మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీస్ ఒకరు గాయపడ్డారు. టపరెంగ్ లుడెన్‌గఢ్ రిజర్వు ఫారెస్టు సమీపాన పోలీస్‌లు ఎద కూంబింగ్ ఆపరేషన్ చేస్తుండగా, కాల్పులు జరిగాయని డిజిపి సునీల్ కె బన్సాల్ చెప్పారు. పోలీస్ కాలికి గాయమైంది. ఆయనను బొలంగీర్ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలంలో ఎకె 17 రైఫల్ స్వాధీనమైందని తెలిపారు.
కాగా, జార్ఖండ్ రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి చెందిన వీ.శరత్ బాబు అనే వ్యక్తిని మావోయిస్టులు అతి దారుణంగా కాల్చి చంపారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కంపెనీలో శరత్ బాబు కాంట్రాక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. కాంట్రాక్టు వర్క్ విషయమై నాలుగు రోజుల క్రితం శరత్ బాబు ఝార్ఖండ్ వెళ్ళాడు. మంగళవారం విధి నిర్వహణ నిమిత్తం వాహనంలో వెళ్తుండగా అతన్ని మావోయిస్టులు కాల్చి చంపారని సమాచారం. శరత్ బాబుకు భార్య ఒక కొడుకు ఉన్నారు.
More Stories
భారత్‌లో ఆడకుంటే బంగ్లాదేశ్‌పై వేటు తప్పదు
గాజా శాంతి మండలిలోకి భారత్‌ను ఆహ్వానించిన ట్రంప్
బంగ్లాదేశ్ లో మూడు రోజులలో ఇద్దరు హిందువుల హత్య