
మహిళలే భారతీయ కుటుంబ వ్యవస్థ మూలాలనీ, వారు కుటుంభం కోసం ఎన్నో త్యాగాలు చేస్తారని కేంద్ర మత్స్య, పశు సంవర్థక, డైరీ మంత్రివర్యులు పరుషోత్తం రూపాల తెలిపారు. జహీరాబాద్ పార్లమెంటు ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా గురువారం కామారెడ్డి నియోజక వర్గ పర్యటనలో మహిళా సంఘాల (డ్వాక్రా) సభ్యుల సమావేశలో పాల్గొన్నారు.
గతంలో మోది సర్కారు రాక ముందు మహిళలు పడుతున్న ఇబ్బందులు చూసి మహిళల సాధికారత కోసమే మోది స్వచ్చ భారత్ ద్వారా ఇంటింటికి మరుగు దొడ్ల నిర్మించారనీ కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ప్రతి బూత్ లో సగానికి పైగా మహిళా ఓటర్లు ఉన్నారని చెప్పారు.
అకాల వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం కలిగిందని రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం గురించి చెబుతూ దీనిపై కేంద్రానికి నివేదిక ఇస్తానని తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కోసం ప్రతి కార్యకర్త రాబోయే ఎన్నికల వరకు పార్టీ కోసం కష్టపడి పని చేయాలని సూచించారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే గెలుపు సులభతరం అవుతుందని చెప్పారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత