కాంగ్రెస్ ఎంపి కార్తీ చిదంబరానికి చెందిన రూ.11.04కోట్ల విలువచేసే ఆస్తులను ఈడి మంగళవారం జప్తు చేసింది. ఐఎన్‌ఎక్స్ మనీలాండరింగ్ కేసులో దర్యాప్తులో భాగంగా ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక ప్రకటనలో ఈడి తెలిపింది.
కర్ణాటకలోని కూర్గ్ జిల్లాలో ఓ ఆస్తితోపాటు మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఆస్తులను జప్తు చేసినట్లు ఈడి పేర్కొంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పిఎంఎల్‌ఎ) ప్రకారం వెలువడిన ఉత్తర్వులను అనుసరించి కార్తీ చిదంబరం ఆస్తులను జప్తు చేసినట్లు ఈడి అధికారులు వివరించారు.
కాగా మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పి చిదంబరం తనయుడే కార్తీ చిదంబరం. తమిళనాడులోని శివగంగ లోక్‌సభ ఎంపిగా కార్తీ చిదంబరం కొనసాగుతున్నారు. ఐఎన్‌ఎక్స్ కేసులో సిబిఐ, ఈడి కార్తీని అరెస్టు చేశాయి.
యూపిఎ ప్రభుత్వం హయాంలో చిదంబరం మంత్రిగా ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుంచి నిధులు పొందారని సిబిఐ ఆరోపించింది. విదేశాల నుంచి పొందిన నిధులను ఐఎన్‌ఎక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌కు మళ్లించినట్లు ఈడి, సిబిఐ ఆరోపించాయి.

More Stories
ఇకపై నమో భారత్ రైళ్లలో పుట్టినరోజులు, పెళ్లిరోజులు
విద్యార్థుల కోసం ‘జెన్-జెడ్’ పోస్టాఫీస్‌లు
అమెరికా ఆంక్షలతో చమురు అమ్మకాలు ఆపేసిన రిలయన్స్