తీర్థ యాత్రికులు ముందుగానే ప్రణాళిక వేసుకోవడం వల్ల కలిగే ఇబ్బందులను అధిగమించేందుకు ఈ రైలు ద్వారా ప్రముఖ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రాలను సందర్శించడానికి ద.మ.రైల్వే ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పిస్తుందని పేర్కొన్నారు. ప్రొఫెషనల్, ఫ్రెండ్లీ టూర్ ఎస్కార్ట్ సేవలు, రైలులో భద్రతతో కూడిన రైల్వే కోచ్‌లను సొంతం చేసుకోవడం లేదా లీజుకు తీసుకోవడం ద్వారా వివిధ నేపథ్యాలతో కూడిన పర్యటనలను నిర్వహించగలమని తెలిపారు.
ఈ యాత్రకు రెండు తెలుగు రాష్ట్రాలలోని మొత్తం 9 స్టాపింగ్ స్టేషన్ల నుంచి యాత్రికుల నుంచి విశేషమైన ఆసక్తి కనబరచడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ రైలు ద్వారా భక్తులు అతి తక్కువ ఖర్చుతో అత్యంత సౌకర్యవంతమైన, సురక్షితమైన పద్దతుల ద్వారా గమ్యస్థానాలను చేరుకుంటారని చెప్పారు. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ఉద్దేశ్యాన్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా జీఎం జైన్ టూరిస్ట్ ఆపరేటర్లకు విజ్ఞప్తి చేశారు.

More Stories
హైదరాబాద్‌పై కాంగ్రెస్ మార్క్ దోపిడీ క్యూర్ చట్టం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లపై బెదిరింపులు, బీఎల్ఓలపై వత్తిళ్లు