తెలుగు రాష్ట్రాలకు మరో 7 వందే భారత్ రైళ్లు

ఎక్కువ దూరాన్ని సాధ్యమైంతన తక్కువ సమయంలో చేరుకునే విధంగా భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లు దేశ్యాప్తంగా 14 నడుస్తున్నాయి. ఇవి కాకుండా మరో 31 మార్గాల్లో వందే భారత్ నడిపేందుకు రైల్వే కసరత్తు చేస్తోంది. ఇవి కూడా అందుబాటులోకి వస్తే దేశవ్యాప్తంగా 45 వందేభారత్ ఎక్స్ ప్రెస్ లు అందుబాటులోకి వస్తాయి.
 
ప్రస్తుతం న్యూఢిల్లీ- వారణాసి, న్యూఢిల్లీ- కాట్రా, చెన్నై- మైసూరు, బిలాస్‌పూర్-నాగ్‌పూర్, గాంధీనగర్- ముంబై సెంట్రల్, న్యూఢిల్లీ- అంబ్ అందౌర, హౌరా- న్యూ జల్పైగురి జంక్షన్, సికింద్రాబాద్-విశాఖపట్నం, ముంబై సెంట్రల్-సోలాపూర్, ముంబై సెంట్రల్-సాయినగర్ షిరిడీ, చెన్నై సెంట్రల్-కొయంబత్తూర్ ల మధ్య నడుస్తున్నాయి.

అదే విధంగా,  అజ్మేర్-న్యూఢిల్లీరాణీ కమలాపతి హబీబ్‌గంజ్-హజ్రత్ నిజాముద్దీన్, సికింద్రాబాద్-తిరుపతి మార్గాల్లో వందే భారత్ లు నడుస్తున్నాయి. ఆగస్టు 15వ తేదీ నాటికి మొత్తం 75 రైళ్లు నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ 31 రైళ్లలో ఏడు తెలుగు రాష్ట్రాలకు కేటాయించారు.  సికింద్రాబాద్-పూణె, విజయవాడ-చెన్నై సెంట్రల్, తిరుపతి-విశాఖపట్నం, కర్నూల్-బెంగళూరు, చెన్నై సెంట్రల్-సికింద్రాబాద్, నర్సాపురం-విశాఖపట్నం, నర్సాపురం-గుంటూరు మార్గంలో వందే భారత్ రైళ్లు తిరగబోతున్నాయి.

న్యూఢిల్లీ-బికనీర్, ముంబై-ఉదయ్‌పూర్, హౌరా జంక్షన్-బోకారో స్టీల్ సిటీ, హౌరా జంక్షన్-జంషెడ్‌పూర్, ముంబై-మడగావ్, జబల్‌పూర్-ఇండోర్, హౌరా-పూరీ, తిరువనంతపురం-మంగళూరు, చెన్నై ఎగ్మోర్-కన్యాకుమారి, ఎర్నాకుళం జంక్షన్-చెన్నై సెంట్రల్ ల మధ్య కూడా ప్రవేశపెట్టనున్నారు.  చెన్నై ఎగ్మోర్-మదురై జంక్షన్, బెంగళూరు-కన్యాకుమారి, మంగళూర్-మైసూర్, ఇండోర్-జైపూర్, జైపూర్-ఆగ్రా, న్యూఢిల్లీ-కోటా, హౌరా జంక్షన్-పాట్నా, బెంగళూరు-ధార్వాడ్, బెంగళూరు-కొయంబత్తూర్ మార్గాలను కూడా రైల్వే పరిశీలిస్తోంది. అయితే ఈ మార్గాలపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.