ఒక్క రోజులోనే 6,050 కరోనా కేసులు నమోదు

దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు మరింత పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లోనే 6,050 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కేసులు నిన్నటితో పోలిస్తే 13 శాతం పెరిగాయని తెలిపింది. కరోనా కారణంగా దేశంలో ఒక్కరోజులోనే 14 మంది మరణించారు.  దీంతో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 28,303కు చేరుకోగా, కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5,30,943 కు చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.39 శాతంగా ఉండగా, వారం వారీ పాజిటివిటీ రేటు 3.02 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇప్పటివరకు కరోనా బారిన పడి, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,41,85,858గా చేరుకుందని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య వెల్లడించారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం మరోసారి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా కేసులపై ఇప్పటికే సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ రాష్ట్రాలు మళ్లీ కరోనా నిబంధనలు పాటించాలని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ఇదే విషయంపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో సమావేశం శుక్రవారం సమావేశం జరిపారు.కరోనా కేసులు పెరుగుతున్న‌నేప‌థ్యంలో పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా చేయాలంటూ విజ్ఞ‌ప్తి చేయగా కరోనా వ్యాక్సిన్ లను కంపెనీల నుంచి నేరుగా రాష్ట్రాలే స్వంత నిధుత‌లో కొనుగోలు చేసుకోవాలంటూ స‌ల‌హా ఇచ్చారు. వివిధ దేశాలు, పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.