అరుణాచల్ పేర్లను చైనా మార్చడాన్ని తిరస్కరించిన భారత్!

అరుణాచల్ పేర్లను చైనా మార్చడాన్ని తిరస్కరించిన భారత్!

దక్షిణ టిబెట్‌గా బీజింగ్ పేర్కొంటున్న అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 స్థానాల పేర్లను మార్చడానికి చైనా చేసిన ప్రయత్నాన్ని భారత్ మంగళవారం తిరస్కరించింది. ఇటువంటి చర్యలు ఈశాన్య రాష్ట్రాలు భారత దేశ అంతర్భాగమన్న వాస్తవాన్ని మార్చజాలవని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారత్ లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని సరిహద్దు ప్రాంతాల 

భారత్ లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని సరిహద్దు ప్రాంతాల పేర్లను చైనా ఎలా నిర్ణయిస్తుంది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.  చైనా చర్య క్షేత్రస్థాయిలో వాస్తవాలను మార్చలేదని భారత్ తేల్చి చెప్పింది.

వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి)లోని లడఖ్ సెక్టార్‌లో సైనిక ప్రతిష్టంభన కారణంగా ఆరు దశాబ్దాలలో రెండు దేశాలు తమ సంబంధాలలో అత్యంత దారుణమైన ద్వైపాక్షిక సంబంధాలను చూస్తున్న సమయంలో చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రదేశాల పేర్లను మార్చింది.  

ఏప్రిల్ 2017లో ఆరు స్థానాల పేర్లు, డిసెంబర్ 2021లో మరో 15 స్థానాల పేర్లను మార్చిన తర్వాత, అరుణాచల్ ప్రదేశ్‌లోని స్థలాల పేర్లను చైనా ఏకపక్షంగా మార్చడం ఇది మూడోసారి.  అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రాంతాలకు కొత్త పేర్లను చైనా ప్రకటించినట్టు మీడియాలో వచ్చిన వార్తలకు తమ స్పందన అంటూ ట్విట్టర్ లో ఓ ప్రకటనను పోస్ట్ చేసింది. విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తన ట్విట్టర్ ఖాతాలో దీన్ని ఉంచారు.

‘‘ఈ తరహా నివేదికలను మేం చూశాం. ఈ తరహా ప్రయత్నాలను చైనా చేయడం ఇదే మొదటిసారి కాదు. నిర్ద్వందంగా దీన్ని ఖండిస్తున్నాం. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగంగా ఉంది. అంతేకాదు ఎల్లప్పుడూ భారత్ లో అంతర్భాగంగా, విడదీయరానిదిగా ఉంటుంది. కొత్తగా కనిపెట్టిన కొన్ని పేర్లను ప్రకటించడం అన్నది వాస్తవాన్ని మార్చదు’’ అని ఆ ప్రకటన స్పష్టం చేసింది.