బీఆర్ఎస్ ను బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడు

బీఆర్ఎస్ ను బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పై, కేసీఆర్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అంటూ బీఆర్ఎస్ అధికారంలో ఉండేది ఇంకా ఆరు నెలలేనని తేల్చి చెప్పారు. ఏప్రిల్ 8 ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా సికాంద్రాబాద్ లో జరిపే బహిరంగ సభతో తెలంగాణ రాజకీయాలలో  పెను మార్పులుంటాయని కిషన్ రెడ్డి వెల్లడించారు.

పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేయబోయే బహిరంగ సభను దిగ్విజయవంతం చేయాలని, అందులో భాగంగా భారీ ఎత్తున ప్రజలను సమీకరించాలని బిజెపి శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ అభివ్రుద్ధికి కేంద్రం అనేక  అభివ్రుద్ధి పనులు చేసుందని చెబుతూ 33 జిల్లాలకు గాను 32 జిల్లాలకు జాతీయ రహదారులను అనుసంధించామని తెలిపారు.

రాష్త్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి తదితరులతో కలసి ప్రధాని మోదీ కార్యక్రమాల ప్రదేశాలను పరిశీలించారు. తదుపరి హైదరాబాద్ సెంట్రల్ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాల నేతలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.  ఏప్రిల్ 8న  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టుకున్నట్టు  కిషన్ రెడ్ తెలిపారు.

రూ.1400 కోట్లతో జరిగిన డబ్లింగ్ పనులను ప్రధాని ప్రారంభిస్తారని చెప్పారు. రూ.7764 కోట్లతో చేపట్టే నూతన  జాతీయ రహాదారులకు ప్రధాని మోదీ భూమి పూజ చేస్తారని తెలిపారు.   అలాగే రూ. 1366 కోట్లతో  బీబీనగర్ ఎయిమ్స్ నూతన భవనానికి  శంకుస్థాపన చేస్తామని పేర్కొన్నారు. ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. అనేక అభివృద్ధి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆయన ఆరోపించారు.

ఎంఎంటీఎస్ ఫేజ్ 2పై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.  ఎంఎంటీఎస్  ఫేజ్2 పై నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నా స్పందించడం లేదని మండిపడ్డాయిరు. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందానికి కట్టుబడి లేకపోడం వల్లే ఎంఎంటీఎస్ ఆలస్యం జరిగిందని తెలిపారు. ఎంఎంటీఎస్ ఫేజ్2 జేఐ కోసం  13 రైళ్లను  ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. ఏప్రిల్ 8న ప్రారంభించనున్న రెండో వందేభారత్ ట్రైన్ వల్ల  హైదరాబాద్ – తిరుపతి ప్రయాణం మరింత  సులభం కానున్నట్లు తెలిపారు.