అగ్రనేతతో సహా ఐదుగురు నక్సల్స్ హతం

శనివారం మహరాష్ట్ర గడ్చిరౌలిలో ఒకరు చనిపోతే తాజాగా సోమవారం జార్ఖండ్‌లో భద్రత బలగాలు జరిపిన కాల్పుల్లో సోమవారం మావోయిస్టు గ్రూప్‌కి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వాళ్లలో ఒకరు అగ్రనేత ఉన్నట్లుగా తేలింది.  ఛత్రా అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో సీఆర్‌పీఎఫ్ కోబ్రా యూనిట్ చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో భద్రత బలగాల తూటాలు మావోయిస్టుల శరీరాల్లోకి దూసుకెళ్లాయి.  చనిపోయిన మావోయిస్టు అగ్రనేతపై రూ. 25 లక్షల రివార్డు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు.
 
జార్ఖండ్ ఛత్రా-పాలము అడవుల్లో మాటు వేసిన మావోయిస్టు సభ్యులను చావు దెబ్బ కొట్టాయి భద్రత బలగాలు. అడవిలో దాగివున్న సమాచారాన్ని పసిగట్టిన సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్ మెరుపుదాడి చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌ చనిపోయిన వాళ్లలో నక్సల్స్‌ ముఠాకు చెందిన స్పెషల్‌ ఏరియా కమిటీ సభ్యుడు గౌతమ్‌ పాసవాన్‌ హతమైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అతడి తలపై రూ.25 లక్షల రివార్డు ఉందని చెప్పారు పోలీసులు.
 
ఘటనా స్థలంలో రెండు ఏకే-47 తుపాకులతో పాటు పెద్ద మొత్తంలో ఆయుధాలు లభించినట్లు ఝార్ఖండ్‌ పోలీసులు వెల్లడించారు. చనిపోయిన ఇద్దరు మావోయిస్టులపై రూ.25 లక్షల రివార్డు, మరో ఇద్దరు నక్సల్స్‌పై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు.జార్ఖండ్ లోని నక్సల్స్‌ కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌ విజయవంతమైంది.
నక్సలైట్లకు సహకరించిన ఇతర వ్యక్తుల ఆచూకీ కోసం అడవిలో పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నారు. అడవిలో మరికొన్ని ఆయుధాలు దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం మరికొందరు నక్సలైట్లకు కూడా బుల్లెట్ గాయాలైనట్లు సమాచారం.